Accidents Due to Huge Potholes in Dwarapudi: ప్రమాదాలకు నిలయం.. ద్వారాపూడి ప్రధాన రహదారి.. ప్రయాణించాలంటే భయం.. - dwarapudi mandapeta road repair
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2023, 10:16 PM IST
|Updated : Aug 28, 2023, 6:29 AM IST
Accidents Due to Huge Potholes in Dwarapudi: ఆ దారిపై ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిందే. రోడ్డుపై అడుగుల లోతులో ఏర్పడిన గుంతల వల్ల ఎప్పుడూ ఏ ప్రమాదం జరగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు ఆ దారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ ప్రమాదాల వల్ల వాహనాలు సైతం పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి ద్వారాపూడి వరకు గల ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. భారీగా ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరి.. ప్రమాదాలకు కారణమవుతోంది. గుంతల్లో నీళ్లు ఉండటం వల్ల అవి ఎంత లోతు ఉన్నాయో తెలియక వాహనాలు అదుపుతప్పి ప్రమాదానికి గురవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆ దారిగుండా వచ్చిన వాహనాలు రోడ్డు సరిగా లేకపోవటంతో దెబ్బతింటున్నాయని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.