లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దర్శి ఎస్ఐ రామకృష్ణ
🎬 Watch Now: Feature Video
ACB Officials Caught the SI Taking Bribe : ఛార్జ్‌షీట్ నమోదు చేయడానికి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐను ఏసీబీ అధికారులు పట్టుబడిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. దర్శి పట్టణానికి చెందిన శేషం పెద్ద రమణయ్య, చిన్న రమణయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరు వృత్తిరీత్యా లాయర్లు. 2022వ సంవత్సరంలో ఒక హత్య కేసులో నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించాలని జిల్లా ఎస్పీ, డీఎస్పీ, దర్శి ఎస్ఐలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పెద్ద రమణయ్య, చిన్న రమణయ్య కేసును విచారణ చేపట్టిన ఎస్ఐ రామకృష్ణ వారికి అనుకూలంగా ఛార్జ్‌షీట్ రాయలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని అడిగారు. దీంతో పెద్ద రమణయ్య సోమవారం (జనవరి 1న) ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు దర్శి పోలీసు స్టేషన్లో లంచం ఇవ్వడానికి పెద్ద రమణయ్య ఒప్పుకున్నారు. పథకం ప్రకారం ఎస్ఐ రామకృష్ణకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐను అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.