CID Cases on CBN and Lokesh in Courts చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ.. లోకేశ్​ ముందస్తు బెయిల్​ పిటిషన్​ సైతం నేడే - స్కిల్ డెవలప్‌మెంట్ కేసు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 10:10 AM IST

ACB Court Hearing on Chandrababu Bail and CID custody Petitions: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సంబంధించి పలు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు విచారణ జరపనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ హైకోర్టులో విచారణకు రానుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ తనను అరెస్టు చేయకుండా లోకేశ్‌.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ్టి వరకు ఆయన్ని అరెస్టు చేయవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో ఇవాళ్టి విచారణలో వెలువడే ఉత్తర్వులు కీలకంగా మారాయి. అంతేకాకుండా ఫైబర్ గ్రిడ్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. రెండు పిటిషన్లపై.. విజయవాడ ఏసీబీ కోర్టు నేడు వాదనలు విననుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఆయన్ని కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్‌ వేసింది. ఈ రెండు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఇరు వర్గాల న్యాయవాదుల తరఫున వాదనలు విన్న తర్వాత నిర్ణయం వెల్లడించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 26 రోజులుగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో అవినీతికి ఆస్కారమే లేదని చంద్రబాబు, తెలుగుదేశం సహా ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే అవినీతి జరిగిందంటూ సీఐడీ, ప్రభుత్వం ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుండగా.. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.