77th Independence day celebration in Paderu : 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా..' స్వాతంత్య్ర దినోత్సవాల్లో సత్తా చాటిన విద్యార్థులు - అల్లూరి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 2023
🎬 Watch Now: Feature Video
77th Independence day celebration in Paderu : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. అతిథులు విద్యార్ధుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో పాల్గొన్న విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని నింపే విధంగా ఉన్నాయి. వివిధ రకాల వేషధారణలతో నృత్యాలు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఎత్తర జెండా అంటూ చేసిన నృత్యాలతో ఆకట్టుకున్నాయి. అలానే దేశభక్తి గేయాలతో అలరించారు. విద్యార్థులు విభిన్న సాహస విన్యాసాలు చేస్తూ అందరితో ఔరా అనిపించారు. విద్యార్థుల మధ్య కుస్తీ పోటీలు నిర్వహించారు. చిన్న వయస్సులో కరాటే చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. విద్యార్థులు నువ్వా నేనా అన్నట్టు ప్రదర్శనలు ఇచ్చారు. దేశభక్తిని తెలియజేసే విధంగా ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులను అభినందించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, పాల్గుణ, పీఓ అభిషేక్ పాల్గొన్నారు.