విశాఖ కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా వార్షిక క్రీడోత్సవాలు - andhra news
🎬 Watch Now: Feature Video
విశాఖపట్నం శ్రీ విజయనగర్‌లోని కేంద్రీయ విద్యాలయం 48వ వార్షిక క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ విద్యాలయం గత 48 వసంతాలుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ.. దేశంలో ఉత్తమ ర్యాంకుల్లో కొనసాగుతోంది. దేశంలో ఉత్తమ ర్యాంకుల్లో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయలన్నింటికి కలిపి వార్షిక క్రీడా పోటీలు నిర్వహించారు. వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
క్రీడలు మాత్రమే కాకుండా.. విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు మారథన్, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా విన్యాసాల ప్రదర్శనను నిర్వహించారు. ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో ఆటల పోటీలను ఏర్పాటు చేశారు ఈ పోటీలలో విద్యార్థులు నూతనోత్తేజంతో పాల్గొన్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాలయ మేనేజ్మెంట్ కమీటి ఛైర్మన్, ప్రిన్సిపల్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడలలో ఉత్సహంగా పాల్గొనాలని ఛైర్మన్ సూచించారు. క్రీడలు విద్యార్థులకు శారీరక, మానసిక, బుద్ధి వికాసానికి తొడ్పడతాయని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో క్రీడోత్సవాలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులను విద్యార్థులు అలరించారు.
విద్యార్థులు కొన్ని ప్రత్యేక పదర్శనలను ఏర్పాటు చేశారు. ఇందులో పతాక వందనం, విద్యార్థినిల మారథన్, స్కౌట్స్ నిర్వహించిన పరేడ్ లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని క్రీడలు ముగిసిన తర్వాత.. బహుమతుల ప్రదానం చేశారు.