108 vehicle on Road: జాతీయ రహదారిపై ఆగిన 108 వాహనం.. పట్టించుకోని అధికారులు - 108 ambulance vehicles repair in ap
🎬 Watch Now: Feature Video
108 vehicle Stop on National Highway : రోడ్డుపై ప్రమాదంలో గాయపడిన వారిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని, అనారోగ్యానికి గురై ఆపదలో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించడానికి 108కు ఫోన్ చేస్తారు. అంబులెన్స్ వచ్చి ఆపదలో ఉన్న వారిని రక్షిస్తుంది... కానీ ఇక్కడ మాత్రం 108 వాహనానికే ఆపద వచ్చింది. అయితే ఆ అంబులెన్స్ వాహనాన్ని ఆదుకోవడానికి అధికారులు కరవయ్యారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం అయ్యవారిపల్లి వద్ద జాతీయ రహదారిపై 108 వాహనం నిలిచిపోయింది. రెండు రోజులుగా 108 వాహనం రహదారిపైనే ఉంది. హిందూపురం నుంచి మడకశిరకు వస్తుండగా ఆకస్మాత్తుగా అయ్యవారిపల్లి వద్ద ఆగిపోయింది. బుధవారం నుంచి నేటికీ రెండు రోజులు గడిచినా.. జాతీయ రహదారిపై రాళ్ల వరుసల మధ్యలో నిలిచి ఉంది. మరమ్మతులు చేయించకుండా రోడ్డుపైనే వాహనాన్ని వదిలేస్తే.. రోగుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనానికి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.