Cat Show in Hyderabad : పిల్లీ.. ఈ షో జరగాలి మళ్లీ మళ్లీ.. "వహ్వా.. వహ్వా" - హైదరాబాద్​లో క్యాట్ షో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 6, 2021, 12:31 PM IST

Cat Show: అమ్మాయిలు చేసే క్యాట్ వాక్ గురించి అందరికీ తెలుసు. మరి, పిల్లుల "క్యాట్ షో" గురించి తెలుసా?? వీధి పిల్లుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో ఈ క్యాట్‌ షో నిర్వహించారు. "వెట్స్‌ సొసైటీ ఫర్‌ యానిమల్‌ వెల్పేర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌" సహకారంతో "మార్స్‌ పెట్‌కేర్‌" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ షోలో దాదాపు 80 పిల్లులు పాల్గొన్నాయి. పిల్లుల ప్రేమికులు వాటిని ఒకే వేదికపైకి తీసుకురావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ రామ్‌చందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్యూట్ క్యూట్.. క్యాట్ షో చూసిన వారంతా.. "పిల్లీ.. నీ షో జరగాలి మళ్లీ.. మళ్లీ" అన్నారు. మరి, మీరు కూడా "వహ్వా.. వహ్వా" అనేయండి..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.