అలుపెరగని అమరావతి రైతులకు మద్ధతుగా ఎన్నారైల గళం - అమరావతి రైతులకు మద్ధతుగా అమెరికా ఎన్నారైలు
🎬 Watch Now: Feature Video
అమరావతి రైతులకు మద్దతుగా ప్రవాసాంధ్రులూ గళమెత్తుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను 200 రోజులుగా రైతులు వ్యతిరేకిస్తున్నారని మేము కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తామని కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపారు. వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అమెరికాలోని మిషిగాన్ స్టేట్లో నివసించే ఎన్నారైలు అన్నారు. సపోర్ట్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం..అమరావతిని రాజధాని రైతుల బాధలను పట్టించుకోవాలని కోరారు.