హైదరాబాద్‌లో నోరూరించే ఐస్‌క్రీముల పండుగ - Indian Ice Cream Expo in hyderabad
🎬 Watch Now: Feature Video
Indian Ice Cream Expo 10th edition భారత ఐస్‌క్రీమ్ తయారీదారుల సంఘం ఐఐసీఎమ్‌ఏ ఆధ్వర్యంలో ఇండియన్ ఐస్‌క్రీమ్ ఎక్స్‌పో పదో ఎడిషన్ ఐఏఎస్ అనిత ప్రవీణ్ చేతుల మీదుగా నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో వివిధ ఐస్‌క్రీమ్ బ్రాండ్స్‌కు సంబంధించిన వివిధ ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్‌లను ప్రదర్శనకు ఉంచుతారు. ఐస్‌క్రీమ్ తయారీ యంత్రాలు, వాటిని భద్రపరిచే కంటైనర్లు అన్నీ ఈ ప్రదర్శనలో చూడొచ్చు. ప్రజలు, వినియోగదారులకు ఐస్‌క్రీమ్‌లలో రకాలు, వాటి తయారీపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST