ETV Bharat / t20-world-cup-2022

YS Viveka Murder Case Updates: వివేకా హత్య కేసు.. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్​రెడ్డిల బెయిల్ పిటిషన్లు కొట్టివేత - YS Viveka murder case today updates

YS Viveka murder case Updates: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి, మరో నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వారిద్దరూ వేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు నిరాకరించింది.

YS_Viveka_murder_case_Updates
YS_Viveka_murder_case_Updates
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 7:54 PM IST

YS Viveka Murder Case Updates: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి, మరో నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వివేకా హత్య కేసు విషయంలో ఆ ఇద్దరు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

YS Bhaskar Reddy And Uday Bail Petitions Dismissed.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇటీవలే సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ.. నిందితులు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయస్థానం.. గత నెల 24న వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసింది. ఈ క్రమంలో ఈరోజు వారిద్దరికీ బెయిల్‌ నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణ వాయిదా.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌

Telangana High Court Mentions Key Points on Viveka Murder Case.. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్​లకు బెయిల్ నిరాకరించిన తెలంగాణ హైకోర్టు కీలక విషయాలను ప్రస్తావించింది. ''భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ భాస్కర్ రెడ్డి ఏపీ సీఎంకు సన్నిహిత బంధువు. ఏ-8, ఎంపీ అవినాష్ రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డి తండ్రి. అవినాష్, భాస్కర్, శివశంకర్‌కు ఉదయ్ అనుచరుడు. భాస్కర్, ఉదయ్ నేరాలపై నమ్మదగిన ఆధారాలున్నాయి. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో ఆధారాలున్నట్లు కనిపిస్తోంది. భాస్కర్, ఉదయ్ ప్రమేయంపై కూడా ఆధారాలున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ భాస్కర్, ఉదయ్ అత్యంత ప్రభావశీల వ్యక్తులు. సాక్షులంతా ఏపీ వారే.. ఇద్దరూ ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షులను భాస్కర్, ఉదయ్ బెదిరించే అవకాశం కూడా ఉంది. స్వేచ్ఛగా, పారదర్శకంగా విచారణ జరపడం ట్రయల్ కోర్టుకు వీలుకాకపోవచ్చు. సాక్షుల భద్రత, పారదర్శక విచారణపై జాగ్రత్త తీసుకోవాలి'' అని ధర్మాసనం వెల్లడించింది.

అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్​పై​ సునీత సవాల్​​..​ భాస్కర్​రెడ్డికి బెయిల్​ నిరాకరణ

High Court on Anticipatory Bail of Avinash Reddy.. అంతేకాకుండా, వివేకా హత్యకు సంబంధించి.. సీఐ శంకరయ్య, కల్లూరి గంగిరెడ్డి సీఆర్ పీసీ 164 వాంగ్మూలమిస్తామని వెనక్కి తగ్గారని హైకోర్టు గుర్తు చేసింది. ఆ ఇద్దరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేసినట్లయితే బెయిల్ రద్దు కోరవచ్చన్న వాదన ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. దస్తగిరి, సాక్షుల వాంగ్మూలాల విశ్వసనీయతను ట్రయల్ కోర్టే పరిశీలిస్తుందని హైకోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందన్న హైకోర్టు.. దస్తగిరి మినహా నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారని వివరించింది. వివేకా హత్య కేసు డైరీ, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించి పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

Both were Involved in Erasing the Evidence.. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని ఏప్రిల్ 14వ తేదీన, వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరూ చంచల్​గూడ జైల్​లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు నిరాకరించింది. దీంతో వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డికి కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో ప్రమేయం ఉందని.. బెయిల్​పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Viveka case: వివేకా హత్య కేసు విచారణ వాయిదా.. తదుపరి విచారణ ఎప్పుడంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.