ETV Bharat / sukhibhava

యుక్తవయసులో వ్యాయామం.. ఎన్నో లాభాలు!

చాలామంది యువతీయువకులు వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపరు. చిన్న వయసే కదా.. చేయకపోతే ఏమవుతుందిలే.. అన్న ధోరణిలో ఉంటారు. కానీ అది తప్పు. యుక్త వయసులో వ్యాయామం చేయటం ద్వారా కండరాలు బలోపేతం కావటానికి, జీవక్రియలు పుంజుకోవటానికి తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

exercise
యుక్త వ్యాయామం
author img

By

Published : Aug 15, 2021, 4:00 PM IST

యుక్తవయసులో చాలామంది వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకోరు. చిన్న వయసే కదా వ్యాయామం చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? అని అనుకుంటుంటారు. నిజానికి యుక్తవయసులో చేసే వ్యాయామాలు భావి ఆరోగ్యానికి మార్గం చూపుతాయి. యుక్తవయసు పిల్లలు రోజుకు గంట, అంతకన్నా ఎక్కువ సేపు శారీరక శ్రమ చేయాలన్నది నిపుణుల సూచన. వీటిల్లో ఎక్కువభాగం ఏరోబిక్‌ వ్యాయామాలు.. అంటే గుండె వేగాన్ని పెంచే సైకిల్‌ తొక్కటం, డ్యాన్స్‌, పరుగు వంటివి ఉండేలా చూసుకోవాలి.

తర్వాత కొద్ది నిమిషాలు బరువులు ఎత్తటం, పుషప్స్‌, బిగుతైన రబ్బరు బ్యాండ్లను లాగటం వంటి బలాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. ఇవి కండరాలు బలోపేతం కావటానికి, జీవక్రియలు పుంజుకోవటానికి తోడ్పడతాయి. కావాలంటే ఇలాంటి వ్యాయామాలను ఇంట్లోనే చేసుకోవచ్చు. వీటికి ప్రత్యేకమైన పరికరాలేవీ అవసరం లేదు. జిమ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. వీటిల్లో తేలికైన వ్యాయామాలూ ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని వ్యాయామాలు ఇవీ.

ఒక వ్యాయామం చేశాక కాసేపు విశ్రాంతి తీసుకొని మరోటి చేయాలి. ఒకో వ్యాయామాన్ని ఎన్నిసార్లు చేయాలన్నది వీలును బట్టి నిర్ణయించుకోవాలి. క్రమంగా సంఖ్యను పెంచుకుంటూ రావాలి.

కూర్చొని వెనక్కు

exercise
కూర్చొని వెనక్కు
  • నేల మీద కూర్చొని, మోకాళ్లు పైకి ఉండేలా కాళ్లను వంచాలి.
  • చేతులను ముందుకు తిన్నగా చాచాలి.
  • నెమ్మదిగా తల, భుజాలను లాగుతూ వెనక్కు వాలటానికి ప్రయత్నించాలి.
  • చేతులు తిన్నగా, కడుపు బిగుతుగా ఉండేలా చూసుకోవాలి.
  • వీలైనంతవరకు వెనక్కు వాలాలి.
  • కాసేపు అలాగే ఉండి, నెమ్మదిగా యథాస్థితికి రావాలి.
  • 10-15 సార్లు ఇలాగే చేయాలి.

కుర్చీ గుంజీలు

exercise
కుర్చీ గుంజీలు
exercise
కుర్చీ గుంజీలు
  • వెనకాల కుర్చీ వేసుకొని, తిన్నగా నిల్చోవాలి.
  • చేతులను ముందుకు చాచాలి.
  • చేతులను వంచకుండా నెమ్మదిగా కుర్చీ మీద కూర్చోవటానికి ప్రయత్నించాలి.
  • పిరుదులు కుర్చీకి తాకకముందే ఆగాలి.
  • నెమ్మదిగా లేస్తూ, తిరిగి తిన్నగా నిల్చోవాలి.
  • 5-10 సార్లు ఇలాగే చేయాలి.

సీతాకోకచిలుక శ్వాస

exercise
సీతాకోకచిలుక శ్వాస
exercise
సీతాకోకచిలుక శ్వాస
  • పాదాలు కాస్త ఎడంగా పెట్టి, తిన్నగా నిల్చోవాలి.
  • రెండు చేతులను పక్కలకు చాచాలి.
  • శ్వాసను వదులుతూ కుడి మోకాలిని పైకి లేపి, ఎడమ మణికట్టుతో తాకాలి.
  • శ్వాసను తీసుకుంటూ యథాస్థితికి రావాలి.
  • శ్వాసను వదులుతూ ఎడమ మోకాలిని పైకి లేపి, కుడి మణికట్టుతో తాకాలి.
  • శ్వాసను తీసుకుంటూ యథాస్థితికి రావాలి.
  • ఇలా 8-15 సార్లు చేయాలి.

ఇవీ చదవండి:

వ్యాయామం చేస్తున్నారా?.. ఇవి తినడం మరవకండి!

రోజువారీ వ్యాయామం మానేస్తున్నారా? అయితే జాగ్రత్త.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.