విషతుల్యాలను (liver problem symptoms) వదలగొడుతుంది. కొవ్వు ఆమ్లాలు జీర్ణం కావటానికి (Liver function) తోడ్పడుతుంది. తిన్న ఆహారంలోని చక్కెరను గ్లైకోజెన్‌గా మారుస్తుంది. దీన్ని కణాల్లో నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఐరన్, రాగి, విటమిన్ల వంటి వాటిని నిల్వ చేసుకుంటుంది. ఇలా చెప్పుకొంటూ పోతే కాలేయం చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. ఇంతటి కీలకమైన దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవద్దూ. ఇందుకు తేలికైన చిట్కా ఒకటుంది.
క్యారెట్, యాపిల్, పుదీనా, దబ్బపండు రసం తాగి చూడండి. దబ్బపండులోని ఎంజైమ్‌లు కాలేయం మరింత సమర్థంగా విషతుల్యాలను విచ్ఛిన్నం చేయటానికి తోడ్పడతాయి. క్యారెట్‌లోని కెరొటినాయిడ్లు విశృంఖల కణాలతో వాటిల్లే (liver diseases) అనర్థాలకు కళ్లెం వేస్తాయి. కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయి. పుదీనాలోని మెథనాల్, మెంథోన్‌లు విషతుల్యాలు త్వరగా బయటకు వెళ్లిపోవటానికి మార్గం సుగమం చేస్తాయి. ఇక యాపిల్ తొక్కలోని ట్రైటెర్‌పెనాయిడ్లు కాలేయ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఇలా ఒకోటీ ఒకో విధంగా కాలేయానికి మేలు చేస్తాయి.