ETV Bharat / sukhibhava

'దానిమ్మ'తో ఎన్ని ప్రయోజనాలో!.. అధిక బరువుకు చెక్​.. షుగర్​ ఉన్నవాళ్లు తినొచ్చా?

Pomegranate Fruit Benefits : తాజా కూర‌గాయ‌లు, పండ్లు తినాల‌ని వైద్యులు సూచిస్తారు. ముఖ్యంగా ఏ కాలంలో దొరికే పండ్ల‌ను ఆ కాలంలో తినాలని చెబుతారు. అయితే ఏడాది పొడ‌వునా దొరికే పండ్లు కొన్ని ఉంటాయి. అందులో దానిమ్మ పండు కూడా ఒక‌టి. ఇందులో మ‌న శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు మెండుగా ఉంటాయి. వాటిని తిన‌టం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇందులో తెలుసుకుందాం.

author img

By

Published : Jul 26, 2023, 7:49 AM IST

Pomegranate Fruit Benefits
Benefits of Pomegranate Fruit

Benefits of Pomegranate Fruit : పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు అందిస్తాయి. ఫ‌లితంగా వాటిని తింటే మ‌న శ‌రీరానికి పోష‌కాలు అందుతాయి. అలాంటి పోష‌కాలు మెండుగా ఉన్న పండ్ల‌లో దానిమ్మ ఒక‌టి. అందుకే త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే రోగుల‌కు అనేక మంది వైద్యులు దానిమ్మ గింజ‌ల్ని తినాల‌ని సూచిస్తారు. మ‌రి అలాంటి దానిమ్మ‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయంటే..

దానిమ్మలోని పోషక గుణాలు :
Pomegranate health benefits : ప‌లు ప‌రిశోధ‌న ప్ర‌కారం.. దానిమ్మ గింజ‌లు అధిక ర‌క్త‌పోటు, చెడు కొలెస్ట్రాల్‌, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌, వాపుల లాంటి వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాల్ని నియంత్రిస్తాయి. ఒక్క దానిమ్మ పండులో దాదాపు 600 గింజ‌లుంటాయి. వీటిలో మెండుగా పోష‌కాలుంటాయి. ఇవి శ‌రీరం లోపల, బ‌య‌టా ఆరోగ్యానికి చాలా సానుకూల ప్ర‌భావం చూపిస్తాయి. ఈ గింజ‌ల్లో విటమిన్ - బి, సి, కె ల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పొటాషియం, కాల్షియం వంటి మిన‌ర‌ల్స్ సైతం ఉంటాయి.

రోగ నిరోధక శక్తి పెంచే దివ్యౌషధం :
డాక్ట‌ర్లు దీనిని హెల్తీ ఫ్రూట్​గా చెబుతుంటారు. పూర్వం జ‌బ్బు చేసిన‌ప్పుడు దానిమ్మ ర‌సం గానీ, దానిమ్మ గింజ‌లు కానీ ఇచ్చేవారు. ఎందుకంటే వీటిలో అధిక మోతాదులో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఆంటీ యాక్సిడెంట్స్, పీచు ప‌దార్థాలు ఉంటాయి కనుక. ఇందులో ఇన్ని పోష‌క ప‌దార్థాలున్నాయి కనుకనే పూర్వ‌కాలంలో ప్ర‌తి ఇంటి పెరట్లో ఈ చెట్టును పెంచే వారు. త‌క్కువ మోతాదులో క్యాల‌రీలు ఉంటాయి. 2 గ్రాముల ప్రొటీన్, అన్ని ర‌కాల బి-కాంప్లెక్స్ విట‌మిన్లు ల‌భిస్తాయి. ఇందులోని విట‌మిన్ - సీ, ఆంటీ యాక్సిడెంట్లు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తాయి.

జ్ఞాపకశక్తి పెంచుతుంది!
Pomegranate nutrition value : దానిమ్మ పండును గింజ‌ల రూపంలో తిన‌టం ఇష్టం లేని వారు జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఈ పండు జ్ఞాప‌క శ‌క్తిని మెరుగు ప‌రుస్తుంది. చిగుళ్ల‌ను బ‌ల‌ప‌రిచి.. వ‌దులుగా మారిన ప‌ళ్ల‌ను గ‌ట్టి ప‌రుస్తాయి. ఈ గింజ‌లు నోటిలోని బాక్టీరియాతోనూ పోరాడ‌తాయి. ఇందులో క‌రిగే, క‌ర‌గ‌ని పీచు ప‌దార్థాలు ఉంటాయి. క‌ర‌గ‌ని పీచే ప‌దార్థం మ‌ల‌బ‌ద్ద‌కాన్నీ దూరం చేస్తుంది. క‌రిగే పీచే ప‌దార్థం మంచి కొవ్వును పెంచి, చెడు కొవ్వుల‌ను త‌గ్గిస్తుంద‌ని ఒక ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

వ్యాధులను నయం చేస్తుంది!
Health benefits of pomegranate : దానిమ్మ పళ్లు రకరకాల పేగు క్యాన్సర్ల బారిన ప‌డ‌కుండా మనల్ని ర‌క్షిస్తుంది. జ‌బ్బు ప‌డ్డ‌ప్పుడు ఎనీమియా, రోగ నిరోధ‌క‌త తగ్గ‌డం లాంటి దుష్ప్ర‌భావాలు ఎదురైన‌ప్పుడు రోజూ రెండు దానిమ్మ పండ్లు తిన‌టం వ‌ల్ల రోగ‌నిరోధ‌క‌త పెరుగుతుంది. అంతేకాకుండా ఈ గింజ‌లు జీర్ణ వ్య‌వ‌స్థ‌ మెరుగ్గా ప‌నిచేయ‌డంలో సాయప‌డ‌తాయి. ముఖ్యంగా వీటిలోని పీచు ప‌దార్థం జీర్ణ ప్ర‌క్రియ‌కు ఎంతో దోహదం చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్థులకు దానిమ్మ తిన‌డం వ‌ల్ల ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

దానిమ్మ పండు - పోషకాలు మెండు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.