ETV Bharat / sukhibhava

పట్టులాంటి కురులకు.. బంగారం లాంటి చిట్కాలు!

కురులు నల్లగా.. ఒత్తుగా.. పట్టులా మృదువుగా ఉంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. కానీ, ఈ గజిబిజీ జీవితాల్లో అలాంటి ఆరోగ్యకరమైన జుట్టు పొందడం కాస్త కష్టమే. కానీ, అసాధ్యం కాదు. సింపుల్ ఆహార చిట్కాలతో మీ జుట్టును మళ్లీ హెల్దీగా చేసేయొచ్చు.

food tips for healthy and silky hair
పట్టులాంటి కురులకు.. బంగారంలాంటి చిట్కాలు!
author img

By

Published : Sep 8, 2020, 10:30 AM IST

మార్కెట్‌లో జుట్టును రక్షించడానికి చాలా ఉత్పత్తులు ఉన్నాయి. వీటి వల్ల జుట్టుకు జరిగే నష్టం కాస్త ఎక్కువే. కారణం వాటిలోని రసాయనాలు. కాబట్టి వాటికి బదులు మన ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల కుదుళ్లు బలంగా తయారవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

క్యారెట్‌

దీన్ని ఎక్కువగా తినడం వల్ల సీబం ఉత్పత్తి అవుతుంది. ఇది మాడును తేమగా ఉంచి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. క్యారెట్‌లోని విటమిన్‌ ఏ నిర్జీవంగా ఉన్న జుట్టును నిగనిగలాడేలా చేస్తుంది. అందుకే దాన్ని రోజుకొకటి తినాలి.

వాల్‌నట్‌

ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్‌ ఈ జుట్టును ఎండనుంచి రక్షిస్తాయి. ఇందులోని బయోటిన్‌ జుట్టు పెరగడానికి, రంగును కాపాడటానికి ఉపయోగపడుతుంది.

పెరుగు

ప్రొబయోటిక్స్‌ దీనిలో ఎక్కువ. పెరుగు మాడుకు సరిగ్గా రక్త సరఫరా జరిగేలా చేస్తుంది. అందుకే రోజూ కప్పు పెరుగు తీసుకోవాలంటారు నిపుణులు.

ఇదీ చదవండి: చనుబాల నాణ్యత పెంచే ఆయుర్వేదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.