ETV Bharat / sukhibhava

వాస్తు దోషం ఉంటే పిల్లలు పుట్టరా? సంతానలేమికి దీనికి సంబంధమేంటి? - సంతానలేమికి వాస్తుతో సంబంధం

Vastu Dosha Effects For Pregnancy In Telugu : సంతానలేమితో బాధపడే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. జీవన శైలి వల్ల వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే పిల్లలు కలగక బాధపడేవారిలో కొందరు దీనికి వాస్తు దోషాలే కారణమని నమ్ముతున్నారు. మరి.. సంతానలేమికి వాస్తు దోషానికి ఉన్న సంబంధమేంటి? ఇందులో వాస్తవికత ఎంత అనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

vastu reason for childless couples
vastu reason for childless couples
author img

By

Published : Aug 4, 2023, 9:59 AM IST

Vastu Reason For Childless Couples : వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందాల్సిన సంతోషాల్లో సంతానమూ ఒకటి. ఇది దంపతుల ఇద్దరికీ ఓ వరం లాంటిది. పెళ్లైన తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని పరితపిస్తూ ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల కొందరికి సంతానం కలగడంలో ఆలస్యం అవుతుంది. మరికొందరిలో అయితే జీవితాంతం ఇది తీరని కోరికలాగే మిగిలిపోతుంది. అలా సంతానం కలగని కొందరు తమ కర్మ ఇంతేనేమో అని సరిపెట్టుకుంటూ జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అయితే వాస్తు లాంటివి నమ్మే మరికొందరు మాత్రం వాటి దోషాల వల్లే తమకు పిల్లలు కలగట్లేదని అనుకుంటారు. వాస్తు దోషం ఉంటే నిజంగానే పిల్లలు కలగరా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాలోనే ఎక్కువ!
భారత్​లో సుమారు 2.75 కోట్ల జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాయని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. పిల్లలు పుట్టకపోవడాన్ని అవకాశంగా తీసుకొని ఐవీఎఫ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చుతున్న మహిళలు ప్రపంచంలో అమెరికా తర్వాత మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. అయితే కొన్నిసార్లు ఈ ప్రక్రియ కూడా విఫలమవుతుండటం గమనార్హం. మహిళల్లో సంతానలేమి సమస్యలకు జీవనశైలిలో మార్పులు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.

వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడం వల్ల కొందరు ఏవేవో అపోహలను నమ్ముతుంటారు. సంతానం కలగకపోవడానికి ఇంట్లో వాస్తు దోషం ఒక కారణమని విశ్వసించేవాళ్లూ ఉన్నారు. వాస్తు శాస్త్రంలో దీనికి కొన్ని పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే పిల్లలు పుడతారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. వాస్తు దోషాలు లేదా ఇతరత్రా నమ్మకాలను పక్కనపెట్టి సైన్స్ ప్రకారం మూలకారణాన్ని గుర్తించి, వైద్యం చేయించుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

అలాంటి నమ్మకాలు పెట్టుకోవద్దు!
Vastu Reason For Childless Woman : 'పిల్లలు పుట్టకపోవడానికి వాస్తు దోషం కారణం అనేది మనం సృష్టించుకున్న కల్పితాల్లో ఒకటి. వాస్తు దోషానికి సంతానం కలగకపోవడానికి అసలు సంబంధమే లేదు. ఈ మూల ఇలా ఉంటే అరిష్టం, ఆ మూల అలా ఉంటే పిల్లలు కలగరు అని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇవన్నీ వాస్తవానికి సుదూరంగా ఉండే విషయాలు. ఇలాంటి వాటిని ఏమాత్రం అంగీకరించొద్దు. సైన్స్ పరంగా ఇది ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ వాస్తు దోషం నిజమైతే ఒకరి మీద ప్రభావం చూపితే.. అందరికీ పైనా చూపాలి. కానీ సైన్స్ అలా కాదు. ఇది నిజనిర్ధారణ మీద ఆధారపడింది. సంతానం కలగకపోవడానికి వాస్తు దోషాలకు సంబంధం లేదు. అలాంటి నమ్మకాలను మనసులో పెట్టుకోవద్దు' అని ప్రముఖ వైద్యులు జి.సమరం చెప్పుకొచ్చారు.

వాస్తు దోషం ఉంటే పిల్లలు కలగరా

ఇవీ చదవండి : టీకా తీసుకుంటే పిల్లలు పుట్టరా? నిపుణుల మాటేంటి?

పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలకు కారణాలేంటి? ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.