Dangerous Lifestyle Diseases: ఇటీవల కాలంలో జీవనశైలి వ్యాధులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవనశైలి కారణంగా అనేక మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహ, ఊబకాయం సమస్యలతో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. చిన్న వయసులోనే చాలా మంది జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మందికి జన్యుపరంగా కొన్ని దీర్ఘకాల వ్యాధులు వస్తాయి, అలాంటి వారు జన్యువులను మార్చుకోలేరు కనుక జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు నిపుణులు. జీవనశైలిలో చిన్నపాటి పాటు మార్పులు చేసుకుంటూ, ఆరోగ్యకరమైన అలవాట్లతో జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
జీవనశైలి అంటే?: మనం రోజూ తినే ఆహారం, చేసే వ్యాయామం, కంటి నిండా పడుకునే నిద్ర, శరీరానికి ఎంత ఒత్తిడిని తీసుకుంటున్నాం.. వీటన్నింటి కలయికే జీవనశైలి. అందులో చిన్నపాటి మార్పులు చేసుకుంటే మనం అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాల వ్యాధుల బారిన పడుకుండా కాపాడుకోవచ్చు. నిపుణులు సూచించిన ఆరోగ్యకరమైన నియమాలను తెలుసుకుందాం.
- రోజూ సరైన సమయానికి నిద్రలేవడం, పడుకోవడం
- రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి
- రోజూ 45 నిమిషాల నుంచి గంట పాటు యోగా/ ప్రాణాయామం/ వ్యాయామం చేయాలి
- జంక్‌ఫుడ్‌ను తినడం తగ్గించాలి
- శరీరానికి బలాన్ని ఇచ్చే మంచి ఆహారాన్ని తీసుకోవాలి
- చిరుధాన్యాలు, తృణధాన్యాలు తినాలి
- మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి
- సామర్థ్యానికి మించిన ఒత్తిడి తీసుకోకూడదు
- అన్ని రకాల పండ్లు ఎక్కువగా తినాలి
ఇదీ చదవండి: కొవ్వును సులభంగా కరిగించేందుకు ఆరు సూత్రాలు!