ETV Bharat / sukhibhava

ఇంటి చిట్కాలతో చుండ్రు ఖేల్ ఖతం... కొద్దిరోజుల్లోనే ఫలితం పక్కా! - చుండ్రు తగ్గాలంటే

Dandruff Treatment At Home : చుండ్రు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇందుకోసం అనేక షాంపులు వాడినా తగ్గకపోవడం వల్ల విసిగిపోయి ఉంటారు. అలాంటివారు వీటిని ఒకసారి ట్రై చేయండి.

Dandruff Treatment At Home
Dandruff Treatment At Home
author img

By

Published : Jul 5, 2023, 9:54 AM IST

Dandruff Treatment At Home : పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, అధిక చెమట, జుట్టు సౌందర్యంపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. చుండ్రు సమస్య వల్ల జుట్టులో పుండ్లు పడతాయి. చుండ్రు సమస్య వల్ల జుట్టులో బూజులా ఏర్పడటం, తెల్లటి రేణువులు పైన కనిపించడం వల్ల జుట్టు అందవికారంగా తయారవుతుంది.

చుండ్రు వల్ల జుట్టు ఊడిపోవడం కూడా జరుగుతుంది. చండ్రు సమస్యకు చాలామంది మార్కెట్‌లో దొరికే రసాయనాలతో పాటు వివిధ ఉత్పత్తులతో తయారుచేసే షాంపులు, ఆయిల్స్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల కొంతమందికి చుండ్రు తగ్గినా.. మరికొంతమందికి తగ్గదు. కానీ కెమికల్స్‌తో తయారుచేసే షాంపులకు బదులు సహజసిద్ధ మార్గాల ద్వారా కూడా చుండ్రును తగ్గించుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

తేయాకు చెట్టు ఆయిల్
తేయాకు చెట్టు ఆయిల్‌లో యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుకు సంబంధించిన ఫంగస్‌ వృద్ధిని అదుపు చేయడానికి ఉపయోగపడతాయి. మీరు సాధారణంగా వాడే ఆయిల్‌లో తేయాకు చెట్టు ఆయిల్‌ను కొన్ని చుక్కలు వేయాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించడం వల్ల లాభం ఉంటుంది. ఇలా వారానికి రెండు, మూడు రోజులు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

Dandruff Treatment At Home
తేయాకు చెట్టు ఆయిల్

ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. అందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని డాక్టర్లు చెబుతారు. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటుంటారు. అయితే ఆరోగ్యానికి కాదు.. జుట్టు సౌందర్యానికి కూడా ఆపిల్ మేలు చేస్తుందట.

ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రు సమస్యను దూరం చేస్తుందట. ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టు కింద ఉండే చర్మం పీహెచ్ స్థాయిలను అదుపులో ఉంచి ఫంగస్‌ని తగ్గిస్తుంది. నీళ్లల్లో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి జుట్టుకు మర్దన చేసుకోవాలి. కొద్ది నిమిషాల అలాగే ఉంచి, ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే చుండ్రు సమస్య దూరమవుతుంది.

Dandruff Treatment At Home
ఆపిల్ సైడర్ వెనిగర్

బేకింగ్ సోడా
బేకింగ్ సోడా చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. తడిగా ఉన్న జుట్టుపై బేకింగ్ సోడాతో మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుని జుట్టు వెంటనే తడి ఆరిపోయేలా చేసుకోవాలి.

Dandruff Treatment At Home
బేకింగ్ సోడా

అలోవెరా
అలోవెరా వాపును తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే గుణాలు జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. అలోవెరా జెల్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత నీటితో జుట్టును శుభ్రం చేసుకుంటే మంచి సత్ఫలితాలు ఉంటాయి. చుండ్రు సమస్య తొలగిపోవడమే కాకుండా జుట్టు కూడా సౌందర్యవంతంగా తయారవుతుంది.

Dandruff Treatment At Home
అలోవెరా

కొబ్బరి నూనె
కొబ్బరినూనెలో సహజసిద్దమైన తేమ శాతం ఉంటుంది. ఇవి జుట్టును పొడిగా చేయడమే కాకుండా దురదను తగ్గిస్తాయి. కొబ్బరినూనెను వేడి చేసి జుట్టుకు రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. వారంపాటు ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Dandruff Treatment At Home
కొబ్బరి నూనె

ఇవీ చదవండి : మందులు వాడినా చుండ్రు పోవడం లేదా? ఇలా చేస్తే రిజల్ట్స్ పక్కా!

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే తగ్గిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.