ETV Bharat / sukhibhava

పీరియడ్స్ సరిగా రావట్లేదా? ఇవి తింటే చాలు - ప్రాబ్లమ్ క్లియర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 1:47 PM IST

Best Foods to Avoid Irregular Periods : మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో.. నెలసరి ఒకటి​. చాలా మందిలో పీరియడ్స్​ సకాలంలో రావు. దీనికి హార్మోన్​ ఇన్​బ్యాలెన్స్​ ప్రధాన కారణం. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి..? ఏం తినాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Best Foods to Avoid Irregular Periods
Best Foods to Avoid Irregular Periods

Best Foods to Avoid Irregular Periods : ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు పీరియడ్స్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టైమ్​కు రాకపోవడం.. బ్లీడింగ్ సరిగా కాకపోవడం వంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. పీరియడ్స్​ రాకపోవడం వల్ల మానసికంగా కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యను కొందరు దీర్ఘకాలంగా అలాగే కొనసాగిస్తుంటారు. మరికొందరు వైద్యులను సంప్రదిస్తారు. అయితే.. నేచురల్​గా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు నిపుణులు! మరి ఆ నేచురల్ పద్ధతులు ఏంటి..? ఏం చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు? అన్నది ఇప్పుడు చూద్దాం.

పీరియడ్స్​ నొప్పి భరించలేకున్నారా? ఈ ఫుడ్స్​తో రిలీఫ్​ పొందండి!

కారణాలు ఇవే: ఇర్రెగ్యులర్​ పీరియడ్స్ ​నుంచి బయటపడడం స్త్రీల చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. కేవలం ఫ్రూట్స్​ తింటే పీరియడ్స్‌ వస్తాయి అనే అపోహ నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. రుతుస్రావం అవ్వడం లేదంటే ముందు దృష్టి పెట్టాల్సింది.. అందుకు గల కారణాల మీద అని చెబుతున్నారు. మహిళల్లో బరువు తక్కువ లేదా మరీ ఎక్కువ ఉండటం.. శరీరంలో కొలెస్ట్రాల్​ అధికంగా పేరుకుపోవటం.. PCOD వంటి సమస్యలు ఉంటే నెలసరి క్రమం తప్పొచ్చని అంటున్నారు. ఇవే కాకుండా.. ఇన్‌ఫెక్షన్లు, రక్తహీనత వంటివి కూడా పీరియడ్స్‌ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

పీరియడ్స్ టైమ్​లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!

ఏం చేస్తే ఈ సమస్య అదుపులోకి వస్తుంది: కారణాలు విశ్లేషించుకున్న తర్వాత వాటి నివారణ మార్గాలపై దృష్టి పెట్టాలి. వెయిట్​ ఎక్కువ ఉంటే.. కెలొరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని మీ డైట్​లో తీసుకోవాలి. ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌, చిప్స్‌, నూనెతో చేసే వాటిని దూరం పెట్టాలి. అలాగే హెల్దీ లైఫ్​స్టైల్​ని అనుసరిస్తే ఈ సమస్యని తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. ఇందులో భాగంగా మంచి కొవ్వులుండే ఫుడ్​ తీసుకోవాలి. రైస్‌బ్రాన్‌, సోయాబీన్‌, నువ్వుల నూనెలను వంటలో చేర్చుకోవాలి. అలాగే పొట్టు ఎక్కువ ఉండే గింజ ధాన్యాలు, గడ్డి నువ్వులు, అవిసె గింజలు వంటివి రోజూ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా పీచు పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

పీరియడ్స్​ కోసం మందులు వాడుతున్నారా? మరిన్ని చిక్కులొస్తాయి - ఇలా సరిచేసుకోండి!

రోజూ మనం తీసుకునే ఆహారంలో.. ఆకుకూరలు, తాజా కూరగాయలు 350 గ్రాములైనా ఉండాలి. 100 గ్రాముల వరకు చికెన్‌, ఫిష్​, ఎగ్స్​, డేట్స్​, ఉడకబెట్టిన శనగలు తీసుకోవాలి. ఇవన్నీ బరువును నియంత్రణలో ఉంచుతాయి. హార్మోన్లలో మార్పునకు జన్యు సంబంధిత కారణాలూ ఉండొచ్చని.. హార్మోన్లను ఉత్పత్తి చేసే ఎండోక్రైన్‌ పనితీరులో తేడా వచ్చినా కూడా నెలసరి ఆగిపోతుందని చెబుతున్నారు. ఇవేవీ కాకుండా మామూలుగానే నెలసరి తప్పింది అనుకుంటే మీ శరీరానికి అవసరమైన కెలొరీలు తీసుకుంటూ, రోజూ వ్యాయామాలు చేస్తే పీరియడ్స్‌ వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

Fruits To Eat During Periods : నెలసరి సమయమా? ఈ పండ్లు తీసుకుంటే.. మీ హెల్త్​కు డోకా ఉండదు!

పీరియడ్స్ టైంలో సెక్స్ చేయకూడదా? ఎవరినీ ముట్టకూడదా?

నెలసరి క్రమం తప్పుతోందా.. కారణమిదే కావచ్చు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.