Benefits of Drinking Water When You Wake Up: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే మార్నింగ్ నిద్ర లేవగానే చేయాల్సిన పని ఒక గ్లాసు నీళ్లు తాగడం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. సరైన ఆహారం, తగినంత నిద్ర మన బాడీకి ఎంత అవసరమో.. సరిపడ నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. అందుకే అంటారు నీరు జీవనాధారం అని. శరీరంలో సుమారు 60 శాతం నీరు ఉంటుంది. అయితే ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం..
శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది: రాత్రంతా నిద్ర పోవడం వల్ల బాడీకి సరిపడా నీళ్లు అందకా.. డీహైడ్రేట్‌కి గురవుతారు. అందుకే ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా మారిపోతుంది. దీని మీద కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి.
జీవక్రియ మెరుగు: ఉదయాన్నే నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది మరింత బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం ద్వారా, జీవక్రియను 24 శాతం వేగవంతం చేయవచ్చు.
మలబద్ధకం నివారణ కోసం మందులు వాడుతున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!
హార్ట్ బర్న్ నుంచి ఉపశమనం: ఒక వ్యక్తి రాత్రి సమయంలో చాలా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు లేదా ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు యాసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్ సంభవించవచ్చు. నిద్రలేచిన తర్వాత ముందుగా నీరు తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపర్చవచ్చు. తద్వారా ఈ సమస్యను అరికట్టడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడం కోసం: క్రమం తప్పకుండా నీటిని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఉదయాన్నే నీరు తాగితే అదనంగా 48 కేలరీలు బర్న్ అవుతాయని ఒక అధ్యయనం వెల్లడించింది. అలాగే సంవత్సరం పాటు ఉదయం పూట నీరు తాగితే 17వేల అదనపు కేలరీలు ఖర్చు అవుతాయి. అంతే దాదాపు 2.5 కేజీల కొవ్వు కరిగిపోతుంది.
ఎగ్స్ Vs పనీర్- ఏది మంచిది? ఎందులో ప్రొటీన్ ఎక్కువ!
రోగనిరోధక శక్తి: ఉదయం పూట నీరు తాగడం వల్ల కడుపు నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది శోషరస వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. కాలక్రమేణా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది వ్యక్తిని మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురిచేసే సమస్య నుంచి కూడా కాపాడుతుంది.
కిడ్నీలో రాళ్ల నివారణ కోసం: ఉదయం పూట నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ఉదయం పూట నీరు తాగడం వల్ల కడుపులోని యాసిడ్‌ను తగ్గించి, రాళ్ల అభివృద్ధిని నివారిస్తుంది.
మెరిసే చర్మం కోసం: మీ చర్మం డల్‌గా మారినట్లయితే నిద్ర లేచిన తర్వాత కచ్చితంగా నీరు తాగాలి. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. కొత్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాదు మొటిమలు తగ్గుతాయి. తేమతో కూడిన చర్మం లభిస్తుంది.
అధిక కొలెస్ట్రాల్ వెన్నలా కరగాలా? మార్నింగ్ ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
బ్రెయిన్ ఫాగ్ సమస్యను తగ్గించడానికి: పరగడుపున నీళ్లు తాగడం వల్ల మెదడు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఇది బ్రెయిన్ ఫాగ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనంలో, పరగడుపున నీళ్లు తాగిన వ్యక్తులు.. నీరు తాగని వ్యక్తుల కంటే మెరుగైన మెదడు పనితీరును కలిగి ఉన్నారని కనుగొన్నారు.
జుట్టు సంరక్షణ కోసం: పరగడుపున నీళ్లు తాగడం వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుంది. నీరు.. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది: నీరు మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ఇది మలవిసర్జనను సులభతరం చేస్తుంది.
నీరసం తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!
కడుపు నొప్పి ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చినట్లేనా? నిపుణులు ఏమంటున్నారు..?