గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు నగదు ఎర వేస్తున్నారు. ఎన్నికలు వచ్చేసరికి మీ సమస్యలు తీరుస్తామని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కడప జిల్లా బి. కోడూరు మండలం ఆనంవారిపల్లెలో వైకాపా బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకునేందుకు నగదుతో ఓటర్లను ప్రలోభపెట్టారు.
రామాలయ నిర్మాణానికి కృషి చేస్తామని.. ఎంత ఖర్చైనా తామే భరిస్తామని భరోసా ఇచ్చారు. దేవుడి సాక్షిగా ఓటు వేయాలంటూ ఓటర్లకు సూచించారు. వైకాపా అభ్యర్థి ఆదిలక్ష్మమ్మ తరఫున కొంత నగదు పంపిణీ చేశారు. నగదు పంపిణీలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ వీరారెడ్డి, వైకాపా నాయకుడు దుగ్గి రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో అక్రమంగా నగదు పంపిణీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: