ETV Bharat / state

YSRCP Leader Arrest: పులివెందులలో కాంట్రాక్టర్​కు బెదిరింపులు.. వైకాపా నేత అరెస్ట్‌ - వైఎస్‌ కొండారెడ్డి అరెస్ట్‌

YSRCP leader arrest: వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా నేత వైఎస్‌ కొండారెడ్డి అరెస్టయ్యారు. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ గుత్తేదారులను బెదిరించటంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కొండారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

YSRCP leader kondareddy arrested
పులివెందుల వైకాపా నేత వైఎస్‌ కొండారెడ్డి అరెస్ట్‌
author img

By

Published : May 9, 2022, 12:47 PM IST

YSRCP leader arrest: వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా నేత వైఎస్‌ కొండారెడ్డి అరెస్ట్​ అయ్యారు. చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన.. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ గుత్తేదారులను బెదిరించారు. ఈ క్రమంలో పులివెందుల- రాయచోటి మార్గంలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో గుత్తేదారులు చక్రాయపేటలో కొండారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కొండారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అన్బురాజన్‌ ధ్రువీకరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.