ఎర్రగుంటలో వైకాపా ప్రచారం ప్రారంభం - ఎర్రగుంటలో వైకాపా కార్యకర్తల ప్రచారం
కడప జిల్లా ఎర్రగుంట మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే వైకాపా ప్రచారం మొదలుపెట్టింది. ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ పోరులో మాజీ మంత్రి మైసూరారెడ్డి కోడలు శ్వేతారెడ్డి ఉన్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ తరుపున అందరూ కలిసికట్టుగా పని చేస్తామని శ్వేతారెడ్డి తెలిపారు. అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.