YSR Kadapa District Court refuses bail to Dasthagiri in atrocity case: మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారినందుకే తన భర్తను, తీవ్రంగా వేధిస్తున్నారని దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. అట్రాసిటీ కేసులో అరెస్టై, 50రోజులుగా కడప కేంద్ర కారాగారంలో ఉన్న దస్తగిరితో ములాఖత్ తర్వాత ఆమె మాట్లాడారు. తన భర్తకు బెయిల్ రాకుండా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివేకా కేసులో రాజీకి రావాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు.
మొద్దు శీనులాగా తన భర్తను కూడా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి భార్య ఆందోళన
మీడియాతో మాట్లాడిన దస్తగిరి భార్య షబానా: వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవరుగా మారినందుకే వైసీపీ పెద్దలు తన భర్తను తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారని, దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. ఎర్రగుంట్ల పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన దస్తగిరి 50 రోజులుగా కడప జైల్లో ఉన్నారు. ఇవాళ ఆయన బెయిల్ పిటిషన్ కూడా కడప కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంలో ఆయన భార్య షబానా కడప జైల్లో ఉన్న దస్తగిరిని ములాఖత్ లో కలిశారు. అనంతరం షబానా మీడియాతో మాట్లాడారు. తన భర్త బెయిల్ పై బయటకు రాకుండా అనేక తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, షబానా కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త అప్రూవర్ గా మారిన తర్వాత రాజీ కావాలని పులివెందుల కు చెందిన వైసీపీ నాయకులు డబ్బులు ఆశ చూపడం లేదంటే బెదిరించడం చేస్తున్నారని షబానా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నిన వెనక్కి తగ్గడం లేదనే ఉద్దేశంతోనే జైలులో పెట్టి ఇబ్బందులు చేస్తున్నారని ఆమె వాపోయారు.
వివేకా హత్యకేసులో నిందితుడిగా నా పేరు తొలగించండి - సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్
అట్రాసిటీ కేసు వివరాలు: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి, తమ బంధువుల అమ్మాయిని కారులో తీసుకెళ్లారని ఆరోపిస్తూ, వైఎస్ఆర్ కడప జిల్లా యర్రగుంట్ల పోలీసులు స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దస్తగిరిపై కిడ్నాప్, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అక్టోబరు 31వ తేదీన దస్తగిరిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేయగా, మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి బెయిలు కోసం కడప కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు జరిగాయి. దస్తగిరికి బెయిలు ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిలు పిటిషన్ కొట్టేశారు. తన భర్తను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని కొద్ది రోజుల క్రితం అతడి భార్య షబానా ఆందోళన వ్యక్తంచేశారు. అందు కోసమే కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించింది. దస్తగిరికి బెయిల్ రాకుండా వైసీపీ ఎంపీ అనినాష్ రెడ్డి, జమ్మలమడుగు సధాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారని షబానా పేర్కొంది. తమకు చావు తప్పా మరో దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేసింది.
సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి పిటిషన్‌పై విచారణ వాయిదా