ETV Bharat / state

Bhasker Reddy Bail Petition: భాస్కర్ రెడ్డికి బెయిలిస్తే దర్యాప్తుపై ప్రభావం.. కోర్టులో సీబీఐ

YS Bhaskar Reddy Bail Petition Updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న వైఎస్‌ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీలో కోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. బెయిల్​ విషయంలో కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటించేందుకు భాస్కర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని న్యాయవాది తెలుపగా.. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సీబీఐ న్యాయవాది తెలిపారు. న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. విచారణను వాయిదా వేసింది.

YS BHASER
YS BHASER
author img

By

Published : Jun 6, 2023, 7:57 PM IST

YS BHASER REDDY BAIL PETITION UPDATES: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం సీబీఐ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకీ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు షరతులను పాటించేందుకు సిద్ధం.. భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు.. అక్రమంగా అరెస్టు చేశారని, వివేకానందా రెడ్డి హత్య జరిగిన రోజున భాస్కర్ రెడ్డి ఆ స్థలంలో ఉన్న ఆధారాలు చెరిపేశారనేందుకు తగిన సాక్ష్యాలు చూపలేకపోయారని.. భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదులు ఈరోజు సీబీఐ కోర్టులో వాదించారు. వివేకాను హత్య చేసిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోందని.. సాక్షులెవరూ కూడా భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పలేదని కోర్టుకు తెలియజేశారు. భాస్కర్ రెడ్డి సాక్షులను.. ప్రభావితం చేస్తున్నారని చెప్పేందుకూ ఎలాంటి ఆధారాలు లేవని.. ఇప్పటివరకూ ఏ ఒక్క సాక్షి కూడా ఫిర్యాదు చేయలేదనే విషయాన్ని గుర్తించాలని న్యాయస్థానాన్ని కోరారు. బెయిలు కోసం ఎలాంటి షరతులు విధించినా పాటించేందుకు భాస్కర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని న్యాయవాది తెలిపారు.

కుట్ర పన్నింది ఆయనే..ఆధారాలున్నాయి.. ఈ నేపథ్యంలో సీబీఐ న్యాయవాది స్పందిస్తూ.. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని.. వివేకా హత్యకు కుట్ర పన్నింది ఆయనే అనడానికి తగిన ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపారు. అనంతరం భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేయగా.. రాతపూర్వక వాదనలు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదికి కోర్టు సూచిస్తూ.. వాదనలు ముగించింది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీన చేపడతామని తెలియజేస్తూ వాయిదా వేసింది.

బెయిల్‌ మంజూరు చేయండి..!.. వైఎస్‌ భాస్కర్ రెడ్డి విషయానికొస్తే.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున వైఎస్‌ భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలంలోని సాక్ష్యాలను చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ ఆయనను ఏప్రిల్‌ 16వ తేదీన పులివెందులలో అరెస్టు చేసి హైదరాబాద్‍‌కు తరలించింది. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన సీబీఐ.. తదనంతరం సీబీఐ కోర్టులో హాజరుపర్చగా భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్‌ భాస్కర్ రెడ్డి తనకు బెయిలు మంజూరు చేయాలంటూ.. సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

45 రోజులుగా జైలులో ఉంటున్నాను.. ఆ పిటిషన్‌లో భాస్కర్ రెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పాత్రకు సంబంధించి.. ఎటువంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు. సాక్ష్యాల చెరిపివేతలో తనకు ఎటువంటి సంబంధం లేదని భాస్కర్ రెడ్డి వివరించారు. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా సీబీఐ తనను అరెస్టు చేసి, అక్రమంగా నిర్బంధించిందని తెలిపారు. అంతేకాకుండా, తనకు వివిధ అనారోగ్య సమస్యలతో పాటు తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని తెలియజేశారు. దాదాపు 45 రోజులుగా జైలులో ఉంటున్నానని, ఇప్పటికే కస్టడీ విచారణ కూడా ముగిసిన నేపథ్యంలో తనకు బెయిల్‌ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి పిటిషన్‌లో వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.