ETV Bharat / state

Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం - వివేకా హత్య కేసు న్యూస్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. వరుసగా 26వ రోజు మరో ఇద్దరిని ప్రశ్నించారు. నిరంతరాయంగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. ఘటనపై పూర్తి వివరాలు తేల్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టారు.

YS Viveka CBI Investigation
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం
author img

By

Published : Jul 2, 2021, 8:14 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. వరుసగా 26వ రోజు మరో ఇద్దరిని ప్రశ్నించారు. కడపకు చెందిన మోహన్ ఆసుపత్రి యజమాని లక్ష్మీరెడ్డిని, పులివెందులకు చెందిన గని యజమాని గువ్వల గంగాధర్​ను అధికారులు..కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారించారు. గంగాధర్​కు కడప ఆర్టీసీ బస్టాండు వద్ద శివసాయి రెసిడెన్సీ కూడా ఉంది. శివసాయి రెసిడెన్సీ, మోహన్ ఆసుపత్రి పక్కపక్కనే ఉంటాయి. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండంగా..వీరిని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పది రోజుల క్రితమమే అధికారులు వీరిద్దరినీ విచారించారు. వడ్డీలకు డబ్బు ఇచ్చే మోహన్ ఆసుపత్రి యజమాని లక్ష్మీరెడ్డితో..వివేకాకు సత్సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

విచారణలో వేగం

వివేకా హత్య కేసును సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 26 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా..మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.

ఎర్ర గంగిరెడ్డి చుట్టూ దర్యాప్తు

మాజీమంత్రి వివేకా హత్యకేసులో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిపైనే ఎక్కువగా దృష్టిసారించింది. ఆయనకు 40 ఏళ్లుగా సన్నిహితంగా మెలిగిన తుమలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి చుట్టూనే కేసు దర్యాప్తు సాగుతోంది. వివేకా కుమార్తె హైకోర్టు(high court)లో వేసిన పిటిషన్‌లో అనుమానితుల జాబితాలో ఎర్ర గంగిరెడ్డి పేరు రెండోది. ఈ నేపథ్యంలో గత నెల మూడోవిడత దర్యాప్తు చేపట్టిన సీబీఐ(CBI).. వరుసగా ఐదురోజుల పాటు ఎర్ర గంగిరెడ్డిని విచారించింది. వివేకా మృతి విషయం తెలిసిన తర్వాత ఆయన ఇంటికి మొదటిగా వచ్చిన 16 మందిలో గంగిరెడ్డి ఒకరు. హత్య జరగడానికి ముందురోజు ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చిన తర్వాత వివేకాను రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద దింపింది కూడా ఎర్ర గంగిరెడ్డే.

సీబీఐ గడప చుట్టూ తిరిగిన సునీత

కేసులో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో అధికారులు పలుమార్లు మాట్లాడారు. వివేకా ఇంటిని వారి సమక్షంలో పరిశీలించారు. ఇప్ప‌టికే వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర‌ గంగిరెడ్డితో (erra gangireddy)పాటు మాజీ కారు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, ఆయ‌న ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ హిద‌య‌తుల్లా, ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే కిరణ్‌కుమార్ యాద‌వ్‌, సునీల్‌కుమార్ యాద‌వ్‌ల‌తో పాటు మ‌రికొంద‌రిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నిరంతరాయంగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు.. ఘటనపై పూర్తి వివరాలు తేల్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టారు.

ఇదీచదవండి

YS VIVEKA MURDER: గని యజమాని గువ్వల గంగాధర్​ను ప్రశ్నిస్తున్న సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.