మూడు రాజధానులకు అనుకూలంగా వైకాపా నేతల ర్యాలీ కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ' మూడు రాజధానులు ముద్దు - ఒక రాజధాని వద్దు' అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధాని ఉంటే అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవుతుందని స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు.ఇదీ చదవండి:
ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు