ETV Bharat / state

అన్నమయ్య జలాశయాన్ని పరిరక్షిస్తాం: ఎంపీ మిథున్ రెడ్డి - కడప అన్నమయ్య ప్రాజెక్టు తాజా వార్తలు

రాజంపేటలోని అన్నమయ్య జలాశయాన్ని ఎంపీ మిథున్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజల దాహార్తిని తీరుస్తున్న ప్రాజెక్టును పరిరక్షిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని... త్వరలోనే సాంకేతిక పరిజ్ఞానంతో గేట్లను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు.

annamaiah jalasayaanni_parirakshistaam
annamaiah jalasayaanni_parirakshistaam
author img

By

Published : Nov 29, 2020, 5:11 PM IST

కడప జిల్లాలోని 3 నియోజకవర్గాల ప్రజల దాహార్తిని తీరుస్తున్న అన్నమయ్య జలాశయాన్ని పరిరక్షిస్తామని ఎంపీ మిథున్​రెడ్డి తెలిపారు. రాజంపేటలోని అన్నమయ్య జలాశయాన్ని ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.... భారీ వర్షాలతో వరద తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. త్వరలోనే సాంకేతిక పరిజ్ఞానంతో గేట్లను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అధిక స్థాయిలో నీటిని నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అన్నమయ్య జలాశయ సామర్థ్యాన్ని పెంచాలని స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లారని వివరించారు.

ఇదీ చదవండి

మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.