రోజురోజుకూ సామాన్యుల నడ్డి విరుస్తున్న పెట్రో ధరలపై వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడారు. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రత్యక్ష, పరోక్ష పన్నులు లేకుండా.. జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం కౌన్సిల్ పరిధిలో ఉన్నందున.. ప్రజలకు సాంత్వన కలిగించేలా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు.
బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 2018లో 65 డాలర్లు ఉంటే.. దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72గా ఉండేది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర అదే స్థాయిలో ఉన్నా.. పెట్రోల్ ధర మాత్రం రూ. 20 పెరిగి రూ. 92కి చేరిందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నులు.. సామాన్యుడికి భారంగా మారాయన్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో జనసేన అభ్యర్థుల ఓటమికి భాజపానే కారణం: పోతిన మహేశ్