కడప జిల్లాలో చాలామంది తెదేపా నాయకులు వైకాపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. జగన్మోహన్రెడ్డి అంగీకరించడం లేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. సీఎం అంగీకారం తెలిపితే.. తెదేపా తాళం వేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి ఆ పార్టీకి ద్రోహం చేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. రామసుబ్బారెడ్డి చేరికపై చర్చలు జరుగుతున్నాయని రఘురామిరెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఏకపక్షంగా ఓటర్ల తీర్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ రేసులో రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేరు దాదాపు ఖరారైందని రఘురామిరెడ్డి వెల్లడించారు.
'జగన్ అంగీకరిస్తే.. తెదేపా తాళం వేసుకోవాల్సిందే' - తెదేపాపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కామెంట్స్ న్యూస్
కడప జిల్లాలో పలువురు తెదేపా నేతలు వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. జమ్మలమడుగుకు చెందిన మాజీమంత్రి రామసుబ్బారెడ్డి వైకాపాలో చేరుతారనే వార్తలపై ఆయన ఆచితూచీ స్పందించారు.

కడప జిల్లాలో చాలామంది తెదేపా నాయకులు వైకాపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. జగన్మోహన్రెడ్డి అంగీకరించడం లేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. సీఎం అంగీకారం తెలిపితే.. తెదేపా తాళం వేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి ఆ పార్టీకి ద్రోహం చేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. రామసుబ్బారెడ్డి చేరికపై చర్చలు జరుగుతున్నాయని రఘురామిరెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఏకపక్షంగా ఓటర్ల తీర్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ రేసులో రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేరు దాదాపు ఖరారైందని రఘురామిరెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: వైకాపా గూటికి డొక్కా మాణిక్య వరప్రసాద్