స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ.. ఉద్రిక్తంగా మారింది. కడప జిల్లా చాపాడులో వైకాపా నాయకులు.. తెదేపా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. మండలంలోని వెదురూరు, లక్ష్మీపేట, చీపాడు ప్రాదేశిక నియోజకవర్గాల నాయకుల నామినేషన్ పత్రాలను చింపేశారు. గ్రామాల నుంచి తరలి వచ్చిన అభ్యర్థులను అడ్డుకున్నారు. ఈ కారణంగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. పోలీసులు ఉండగానే.. వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి: