కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు పరిధిలోని హస్తవరం వద్ద.. రైల్వేట్రాక్ వరదలతో దెబ్బతింది. దీంతో.. కడప నుంచి చెన్నై, రేణిగుంట వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో వచ్చిన వరద ప్రవాహానికి రెండు ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్పందించిన అధికారులు.. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ(Hastavaram railway track repairing) పనులు చేపట్టారు.
వందలాది మంది కార్మికులు ట్రాక్ పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు. వర్షాలు కొంత మేర అంతరాయం కలిగించినా పనులు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో జేసీబీలతోపాటు ప్రత్యేకంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి కార్మికులను తరలించారు. కనీసం ఒక్క ట్రాక్ అయినా బాగుచేసి అందుబాటులోకి తెచ్చేందుకు.. కార్మికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ.. అందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Rayala Cheruvu Leakage: రాయలచెరువు కట్టకు స్వప్ప గండి.. భయాందోళనలో స్థానికులు