ETV Bharat / state

ఎర్రగుంట్లలో వివాహిత ఆత్మహత్య.. తల్లిదండ్రుల అనుమానం - yerraguntla latest news

కడప జిల్లా ఎర్రగుంట్లలో విషాదం నెలకొంది. ముద్దనూరు రోడ్డులోని ఓ ఇంట్లో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

women suicide with hanging in yerraguntla kadapa district
ఎర్రగుంట్లో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Sep 7, 2020, 5:51 PM IST

Updated : Sep 7, 2020, 7:43 PM IST

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణానికి చెందిన రాధకు, నాగేశ్వర్​తో వివాహం జరిగింది. నాగేశ్వర్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా వీరిరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్​లో పంచాయితీ జరిగింది.

ఈ ఘటనపై మనస్తాపం చెందిన రాధ.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. తమ కూతురును భర్త తరఫు బంధువులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కావాలనే రథం దగ్ధం చేసినట్టుంది: ఆర్​ఆర్​ఆర్

Last Updated : Sep 7, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.