ETV Bharat / state

పెద్దపసుపులలో బావిలో దూకి మహిళ ఆత్మహత్య

కుటుంబకలహాలతో ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపులలో జరిగింది.

women suicide at peddapasupula
పెద్దపసుపులలో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
author img

By

Published : Aug 13, 2020, 7:22 AM IST

కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి చెందిన ఓ వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణమ్మ(31)కి కడపకు చెందిన శివతో పదకొండేళ్ల కిందట వివాహమయ్యింది. దంపతులు కొన్నేళ్లపాటు హైదరాబాదులో నివాసం ఉన్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. హైదరాబాదులో ఉన్న సమయంలో దంపతులు తరచూ గొడవపడే వారని పోలీసులు తెలిపారు. మనస్పర్థలు ఎక్కువ కావడంతో.. వారిద్దరు గ్రామానికి చేరుకున్నారు. ఏమైందో ఏమో లక్ష్మీనారాయణమ్మ.. ఇంటి సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు . బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదీ చూడండి. ఒడిశా సీఎంతో చర్చలను ఖరారు చేయండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.