BADANGI AIRSTRIP: బ్రిటిష్ పరిపాలనా కాలంలో రక్షణ అవసరాలకు ఉపయోగించిన విజయనగరం జిల్లా బాడంగిలోని ఎయిర్ స్ట్రిప్‌ను పునర్ నిర్మించాలని భారత నావికా దళం అధికారులు యోచిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్‌గా దీన్ని పరిగణిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ స్ట్రిప్‌ను పునర్మించాలనుకోవడం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ స్ట్రిప్ పునర్ నిర్మాణానికి అడుగులు: శత్రుదేశాల ముప్పు ఎదుర్కొనేందుకు వీలుగా నగరానికి కొంత దూరంలో ఉన్న బాడంగిలో మరో నేవీ ఆర్మమెంట్ (ఆయుధ కేంద్రం) డిపో నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మందు గుండు, క్షిపణులు, టోర్పెడోలు, రసాయన ముడిసరుకుల నిల్వ, నిర్వహణ, సకాలంలో సరఫరా చేసే బాధ్యతంతా ఆయుధ డిపోల నుంచి సాగేలా నేవీ చూస్తుంది. బాడంగి భూములు భోగాపురం విమానాశ్రయానికి 70 కి. మీ. జాతీయ రహదారికి 7 కి.మీ., డొంకినవలస రైల్వే స్టేషనుకు 3 కి.మీ. దూరం ఉండటం ఉపయోగకరమని నావికాదళం భావిస్తోంది. ఫైటర్ జెట్లు పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. నౌకలకు కావాల్సిన సరుకులు సకాలంలో అందించడానికి ఎయిర్ వే, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లకు సామగ్రి తరలించడానికి సమీపంలో రైల్వే మార్గం ఉండటం అనుకూలమని భావిస్తున్నారు.
అదనంగా మరో 1700 ఎకరాల సేకరణకు ప్రతిపాదన: బాడంగిలో ఎయిర్ స్ట్రిప్‌ను బ్రిటిష్ హయాంలో 90 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో యుద్ధ అవసరాలు, సరుకుల రవాణాకు 227 ఎకరాల్లో రన్ వే , ఏటీసీ, బంకర్లు నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సూపర్ మెరైన్ స్పిట్, ఫైర్ ఫైటర్స్, హాకర్ హరికేన్, ఫైటర్స్, బాంబర్లు, బీ-57 కాన్ బెర్రా ఇక్కడ ఉండేవి. 1946 లో ఈ ఎయిర్ స్ట్రిప్ ను మూసివేశారు. ఆ తరువాత ఎఫ్ సీఐ దీన్ని కొంతకాలం పాటు వరి, గోధుమలు నిల్వ చేసేందుకు ఉపయోగించింది. ప్రస్తుతం ఈ భూముల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఎయిర్ స్ట్రిప్‌కు ఇరువైపులా భూములను 'టి' ఆకారంలో సేకరించాలని నేవీ అధికారులు కోరారు. కొన్ని రోజుల క్రితం విశాఖ ఎన్ ఏడీ, నావికాదళం, రెనెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో దీన్ని పరిశీలించారు. ఎయిర్ స్ట్రిప్‌కు ఇక్కడున్న భూమికి అదనంగా మరో 1700 ఎకరాలు అవసరమని ప్రతిపాదించారు. ముగడ,మల్లంపేట, పూడివలస, రామచంద్రాపురం, కోడూరు పరిధిలో భూముల సేకరణకు ఓ ధర నిర్ణయించే అవకాశాలున్నాయి.
జెట్ స్పీడ్‌గా అమరావతి నిర్మాణం - త్వరలోనే పోలవరం పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు
ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు - అమరావతి రైల్వే లైన్ మ్యాప్ చూశారా?