ETV Bharat / state

శిథిలావస్థకు వంతెనలు - ప్రజలకు తప్పని ఇబ్బందులు - INCOMPLETE BRIDGES IN NTR DISTRICT

ఏళ్ల తరబడి తల్లడిల్లుతున్న జనం - సమస్యను గాలికొదిలేసిన గత ప్రభుత్వం - సమస్య పరిష్కరించాలంటున్న ప్రజలు

DILAPIDATED AND INCOMPLETE BRIDGES IN NTR DISTRICT
DILAPIDATED AND INCOMPLETE BRIDGES IN NTR DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 12:32 PM IST

Problems of Incomplete Bridges in NTR District: ఎన్టీఆర్ జిల్లాలో శిథిలావస్థ, అసంపూర్తి వంతెనలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. వీటిని పూర్తి చేయాలని, మరిన్ని కొత్త వంతెనలను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నప్పటికీ ఫలవంతం కావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సమస్యను పూర్తిగా గాలికొదిలేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.

శిధిలావస్థ వంతెనలతో ఇబ్బందులు: ఎన్టీఆర్ జిల్లాలో పలు వాగులు, వంకలు వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. వీటిపై ఎప్పుడో నిర్మించిన వంతెనలు కొన్ని శిథిలావస్థకు చేరుకోగా, మరికొన్ని ప్రారంభ దశలోనే ఎదురు చూస్తున్నాయి. నిధులు కొరత మూలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని కీలక మార్గాల్లో శిథిల వంతెనలు ప్రజలకు పరీక్షలు పెడుతున్నాయి. జి.కొండూరు మండలం ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై వంతెన 2022లో పూర్తిగా ధ్వంసమైంది. కొత్తగా వంతెన నిర్మాణానికి 10.5 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపగా ఆమోదం రాలేదు. ఈ మార్గం మీదుగా జి. కొండూరుకు 8 గ్రామాల ప్రజలు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ గుణదల ఒకటో డివిజన్​లో ఉలవచారు కంపెనీ నుంచి కార్ల్ మార్క్స్ రోడ్డు వరకు పైవంతెన నిర్మాణానికి రంగం సిద్ధమైంది.

ఎన్టీఆర్ జిల్లాలో శిథిలావస్థ వంతెనలు-నూతన నిర్మాణాలను చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి (ETV Bharat)

ఏళ్ల తరబడి అవస్థలు: 2009లో మంజూరైన ఈ పైవంతెన పదిహేనేళ్ల పాటు నత్తనడకన నడిచింది. అయితే ఇప్పుడు పైవంతెన నిర్మాణానికి భూసేకరణ ఓ కొలిక్కి వచ్చింది. నూరు శాతం రైల్వే నిధులతో నిర్మాణానికి రైల్వేకు ప్రతిపాదించగా అంగీకరించారు. అయితే డివిజన్​లో విద్యుత్తు లైన్లు, డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించాలి. వీటిని సొంత ఖర్చుతో తొలగించేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. 21 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపగా పాలన అడ్డంకులు తొలగాయి. విజయవాడ రైల్వే జీఎం నుంచి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ అనుమతులు రాగానే త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై కొత్త వంతెనను ఏర్పాటు చేయాలని తమ మొరను ప్రభుత్వం ఆలకించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మైలవరం మండలం పుల్లూరు శివారు కొత్తగూడెం నుంచి చిలుకూరివారిగూడెం, సీతారాంపురం తండాలకు వెళ్లే దారిలో బుడమేరు పైవంతెన 2022లో కోతకు గురై కుంగింది. నాటి నుంచి తాత్కాలిక మరమ్మతులూ లేక ద్విచక్ర వాహనాల ప్రయాణాలకే పరిమితమైంది. ఎప్పటికప్పుడు 25 లక్షలతో అధికారులు అంచనాలు వేయడమే తప్ప ఆమోదం లేక నేటికీ పెద్ద వాహనాలను పుల్లూరు మీదుగా మళ్లించి గ్రామానికి చేరుతున్నారు. ఇక్కడ లోలెవెల్ వంతెన రైలింగ్ శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. మైలవరం మండలం చండ్రగూడెం వద్ద 50 ఏళ్ల నాటి వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. నిరుడు భారీ వరదలకు ఓ పిల్లర్ కుంగింది.

సమస్యను పరిష్కరించాలని ప్రజల విజ్ఞప్తి: నాలుగు నెలలుగా పెద్ద వాహనాల రాకపోకలు నిలిపేశారు. దీని పూర్తిస్థాయి మరమ్మతులకు 30 లక్షలు అవసరమని అంచనా వేశారు. మరోసారి భారీ వరదలొచ్చేలోపే ప్రతిపాదనలకు ఆమోదం లభించకపోతే, పూర్తిగా కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెయిలింగ్ సరిగ్గా లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కీలకమైన మార్గాల్లో శిథిలావస్థకు చేరిన ఈ వంతెనల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకుంటే వర్షాకాలంలో మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

''ఈ కొత్త వంతెన కూడా బాగాలేదు. పాతది విరిగిపోయింది. అసలు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. బస్సులు గాని, ఆటోలకు గాని వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైనా నిత్యావసరాలకు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందిగా ఉంది. ఇంచుమించు గత 5 ఏళ్లుగా దీనివల్ల నరకం చూస్తున్నాం. పిల్లలకు స్కూళ్లకు వెళ్లేందుకు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు మార్లు ఈ మార్గంలో వెళ్లిన వాహనాలకు ప్రమాదాలు సంభవించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందిస్తే వాహన రాకపోకలకు ఉపయోగకరంగా ఉంటుంది''- స్థానికులు, ముత్యాలంపాడు గ్రామం

కాల్వలోకి ఒరిగిన స్కూల్ బస్సు - చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం

ఎన్నాళ్లో! జల్లేరు దాటే ప్రజల అవస్థలు - ఐదేళ్లుగా నిలిచిన ఆర్టీసీ సేవలు

బ్రిడ్జి సైడ్‌ వాల్‌లో ఇరుక్కున్న కారు - తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.