ETV Bharat / state

ATTACK: మహిళపై కర్రలతో దాడి.. తమ్ముడే చేయించాడని ఆరోపణ - kadapa district crime

అక్కాతమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదంలో అక్కపై కర్రలతో దాడి జరిగింది. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో జరిగింది.

మహిళపై కర్రలతో దాడి
మహిళపై కర్రలతో దాడి
author img

By

Published : Nov 13, 2021, 10:40 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణానికి చెందిన అపర్ణ, జగదీశ్​లు అక్కాతమ్ముళ్లు. లండన్​లో స్థిరపడ్డ జగదీశ్.. జమ్మలమడుగులో ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఇంటిని నిర్మించాడు. గృహ నిర్మాణ పనులను అపర్ణ పర్యవేక్షిస్తూ పని పూర్తయ్యేలా చూసుకుంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా తనకు ఆ ఇంట్లో తనకు సుమారు రూ.20 లక్షలు వాటా ఉన్నట్లు అపర్ణ వాదిస్తోంది. ఫలితంగా వీరిరువురి మధ్య రెండేళ్లుగా ఘర్షణ జరుగుతోంది. సమస్య ఎంతటికీ పరిష్కారం కాకపోవడంతో కొంతమంది వ్యక్తులు అపర్ణపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అపర్ణను ఆస్పత్రికి తరలించారు. ఆస్తి కోసం తన తమ్ముడు జగదీశ్ తనపై దాడి చేయించారని ఆమె ఆరోపించారు.

ఇదీ చదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.