కడప శివారులోని రుద్రభారతి పేటకు చెందిన ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రభారతి పేటకు చెందిన సమ్మక్కకు 14 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. కొడుకు ఉన్నాడు. ఇటీవల ఆమె భర్తకు తెలియకుండా అప్పులు చేసింది. అప్పు ఇచ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. మాస్కే కవచం.. పోస్టర్ విడుదల