తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా తనను నియమించడంపై కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
వైకాపా ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని లింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థపై, వైకాపా సర్కార్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని లింగారెడ్డి అభిప్రాయపడ్డారు.