కడప జిల్లా వల్లూరు మండలం కమలాపురం మాచిరెడ్డిపల్లిలో తెదేపా లోక్ సభాపక్ష సమావేశం జరిగింది. తమది రైతు ప్రభుత్వం అని చెప్పే సీఎం జగన్ తన సొంత జిల్లాలో వేల ఎకరాల పంటలు నష్టపోయిన అన్నదాతలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి ప్రశ్నించారు.
వెంటనే ఆదుకోవాలి..
తక్షణమే బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని చెప్పి.. ఆ రుసుములు కట్టకుండా చేతులెత్తేసి రైతులను నిండా ముంచారని మండిపడ్డారు.
నిధులొచ్చినా..
గత తెదేపా ప్రభుత్వంలో చేసిన పంచాయతీ పనులకు నాలుగు నెలల క్రితమే నిధులొచ్చినా ఇప్పటికీ చెల్లించకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల అనుసంధానం వల్ల రోడ్లు కుంట పనులు, చెరువు పనులకు బిల్లులు ఇవ్వకుండా నిలిపేయడం ఏం పద్ధతని నిలదీశారు.
విడ్డూరం..
వైకాపా నేతల కాంట్రాక్టు పనులకు బిల్లులు వెంటనే మంజూరు చేయడం విడ్డురంగా ఉందన్నారు. బకాయి బిల్లులు వెంటనే విడుదల చేయకుంటే మాజీ ప్రజా ప్రతినిధులు, తెదేపా కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేసే పరిస్థితి జగన్ సర్కార్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.