ETV Bharat / state

'లాక్​డౌన్ పూర్తవగానే తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి' - తెలుగు రాష్ట్రాలపై భాజపా దృష్టి

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తామని భాజపా ఎంపీ సీఎం రమేష్ అన్నారు. లాక్​డౌన్ పూర్తవగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై... పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు.

bjp mp cm ramesh
bjp mp cm ramesh
author img

By

Published : Jun 6, 2020, 1:37 PM IST

లాక్​డౌన్ పూర్తయిన తర్వాత భాజపా కేంద్ర నాయకత్వం రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల తర్వాతే రెండు రాష్ట్రాల్లో తానే పర్యటిస్తానని కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారని... కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారని పేర్కొన్నారు. లాక్​డౌన్ పూర్తవగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో భాజపా పుంజుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రచిస్తోందని ఎంపీ రమేష్ కడపలో వ్యాఖ్యానించారు.

నరేంద్రమోదీ ఏడాది పాలన సందర్భంగా దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని... అనేక సంస్కరణలతో ప్రజలకు మేలు చేశారని రమేష్ అన్నారు. కానీ రాష్ట్రంలో వైకాపా ఏడాది పాలన ఏవిధంగా ఉందో ఆ పార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 203 జీవోను స్వాగితిస్తున్నామని చెప్పారు. కానీ దానికంటే ముందు గత ఏడాది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గండికోట ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే... ముందు ముంపు బాధిత గ్రామాలను ఖాళీ చేయించాలన్నారు. వెయ్యి కోట్ల రూపాయల ముంపు వాసుల పరిహారం విడుదల చేస్తే 26 టీఎంసీల నీటి నిల్వకు వీలుంటుందనే విషయాన్ని సీఎం గుర్తించాలని ఎంపీ సీఎం రమేష్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..?: ఏవీ సుబ్బారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.