ETV Bharat / state

నాడు-నేడు.. శుద్ధి జలం అందేదీ ఇంకెన్నడు ?

అవీ పిల్లలు చదువుకునే పాఠశాలలు. అక్కడ వారు తాగేందుకు అధికారులు కొత్త కుళాయిలు ఏర్పాటు చేశారు. కానీ తాగునీరు మాత్రం రావడం లేదు. బడులు ఆర్వో ప్లాంట్లకు నోచుకోలేక విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. నాడు-నేడుకు ఎంపికైన ప్రతి పాఠశాలలో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకూ ఆ చర్యలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఉసూరుమంటున్నారు.

author img

By

Published : Nov 8, 2020, 6:50 PM IST

నాడు - నేడు.. శుద్ధి జలం అందేదీ ఇంకెన్నడు ?

ప్రతి ఒక్కరూ తగినంత నీరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.. లేదంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో విద్యార్థులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో శుద్ధిజలం అందడం లేదు. ఫలితంగా అందుబాటులో ఉన్న సాధారణ నీరే తాగాల్సి వస్తోంది. మరికొందరు ఆ నీరు తాగేందుకు ఇష్టపడటం లేదు. ఈ సమస్య ఏళ్ల కాలంగా ఉన్నా పరిష్కారం కావడం లేదు.

నాడు జలమణి.. నేడు ఆర్వో ప్లాంట్లు..

ఈ నెల రెండు నుంచి 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ ఒక పూట తరగతులు నిర్వహిస్తుండగా 9వ తరగతుల వారికి రోజు మార్చి రోజు జరుపుతున్నారు. విద్యార్థులకు శుద్ధి జలం అందించాలనే లక్ష్యంతో 2008-09లో ప్రభుత్వం జలమణి పథకానికి శ్రీకారం చుట్టింది.

పర్యవేక్షణ లోపంతో..

పర్యవేక్షణ లోపంతో అవి కొన్నిరోజులకే మరమ్మతులకు గురయ్యాయి. ఆ తర్వాత వాటిని పట్టించుకున్న పాపానపోలేదు. అనేక బడుల్లో విద్యార్థులకు రక్షిత నీరు కరవైంది. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం నాడు-నేడు నిధులతో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఎక్కడా అమలు కావడంలేదు..

పాఠశాలలు పునః ప్రారంభమైనా అది ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఆర్వోప్లాంటుకు సంబంధించి ప్రత్యేక గదిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. బయట కుళాయి కనెక్షన్‌ ఇచ్చారు. అయితే యంత్రాలు రాకపోవడంతో అవి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి.

ఆ నీరే తాగుతున్నారు..

ఫలితంగా విద్యార్థులు సీసాలతో ఇళ్ల దగ్గర నుంచి తెచ్చుకున్న నీటినే తాగుతున్నారు. ఈ నెల 23 నుంచి 6-8 తరగతుల విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరగా నీటిశుద్ధి యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడితే ఫలితం ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.

నెలలో పనులు పూర్తి చేస్తాం..

ఆర్వో ప్లాంట్లకు సంబంధించి టెండరు ఇంకా పూర్తి కాలేదు. 835 పాఠశాలల్లో శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు సంబంధించి అన్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా గదులు కూడా సిద్ధంగా ఉన్నాయి. టెండరు పూర్తికాగానే యంత్రాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తాం. నెలలోపు ఆర్వోప్లాంటు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. - అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష పథక అధికారి, కడప

ఇవీ చూడండి : సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.