ETV Bharat / state

చేనేత కార్మికుల ఆందోళన.. 'అర్హులకు నేతన్న నేస్తం రాదా?' - latest jammalamgudugu news

తరతరాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తుంటే నేతన్న నేస్తం పథకంలో ఎందుకు అర్హత కల్పించరని చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు.

kadapa district
'అర్హులకు నేతన్న నేస్తం రాదా?'
author img

By

Published : Jun 2, 2020, 10:32 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మోరగుడి గ్రామానికి చెందిన చేనేత కార్మికులు నిరసన తెలియజేశారు. నేతన్న నేస్తం పథకం వర్తింపజేయాలంటూ కడప చేనేత జౌళి శాఖ కార్యాలయానికి దరఖాస్తులు పంపించామని చెప్పారు . జిల్లా అధికారులు అర్హులుగా గుర్తించి దరఖాస్తులను గ్రామ సచివాలయానికి పంపిస్తే.. వాలంటీర్లు, గ్రామ సంక్షేమ అధికారులు తిరస్కరిస్తున్నారని వాపోయారు.

నిజమైన లబ్ధిదారులకు ఈ పథకం వర్తించదా అని ప్రశ్నించారు . అనర్హులు చాలామంది నేతన్న నేస్తం కింద లబ్ధి పొందారని ఆరోపించారు. ఇప్పటికైనా నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

ఇది చదవండి మత్తు కోసం శానిటైజర్​ తాగిన తల్లి కొడుకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.