ETV Bharat / state

'బువ్వ పెట్టండి సార్'.. విద్యార్థుల వినూత్న నిరసన

కడప జిల్లా రాజంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు
author img

By

Published : Jul 3, 2019, 3:28 PM IST

రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ఆర్ఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద బైఠాయించి.. ప్లేట్లు పట్టుకుని 'బువ్వ పెట్టండి సార్' అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నారని... సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌలభ్యం కోసం గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయడంతో ఎంతోమంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.

ఇది కూడా చదవండి.

ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు ఉధృతమే

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో భాజాపా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. టీడీపీ నుంచి ఇటీవలే భాజాపా లో చేరిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్య నారాయణ తొలిసారిగా ధర్మవరం లో భాజపా సమావేశం నిర్వహించారు. నియోజక వర్గంలో ని నాయకులు. కార్యకర్తలు హాజరయ్యారు.కొన్ని పరిస్థితుల్లో టీడీపీ నుంచి భాజపా లోకి వెళ్లాలిసి వచ్చిందని కార్యకర్తలకు సూర్య నారాయణ వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యం లో లో భాజపాలో పని చేద్దామని సమావేశానికి హాజరైన టీడీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే తెలిపారు నెల 6 నుంచి భాజపా సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ధర్మవరం పట్టణంతోపాటు ఉ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సమావేశానికి కి హాజరయ్యారు

Body:భాజపా సమావేశం

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.