ఎర్రముక్కపల్లి వార్డు సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన సురేష్... గత కొంత కాలం నుంచి వార్డు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సురేష్ కు భార్య పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల నుంచి కుటుంబ కలహాలతో సురేష్ సతమతమవుతున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చదవండి: రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్