ETV Bharat / state

తొమ్మిదేళ్ల బాలికపై వీఆర్‌ఏ అత్యాచారం - మైలవరంలో బాలికపై అత్యాచారం తాజా వార్తలు

కడప జిల్లా మండల కేంద్రమైన మైలవరంలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వీఆర్‌ఏ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

VRA rape of a nine-year-old girl in mailavaram
తొమ్మిదేళ్ల బాలికపై వీఆర్‌ఏ అత్యాచారం
author img

By

Published : Aug 31, 2020, 9:09 AM IST

అభం శుభం తెలియని చిన్నారిపై ఓ వీఆర్‌ఏ అత్యాచారానికి పాల్పడ్డాడు. కడప జిల్లా మండల కేంద్రమైన మైలవరంలో ఈ ఘోరం జరిగింది. జక్కా నాగమునెయ్య (45) మైలవరంలో వీఆర్‌ఏ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి సమీపంలో ఉన్న తొమ్మిదేళ్ల బాలికపై అతను కన్నేశాడు. శనివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న ఆలయం వెనుకవైపు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అరుపులు విని స్థానికులు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. నాగమునెయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి. వరవరరావు కోసం లేఖ రాస్తే దేశ బహిష్కారం కోరతారా?: భూమన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.