కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు శనివారం రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు సీతా, లక్ష్మణ సమేతంగా దర్శనమిచ్చారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు. ప్రతీ ఏడాదీ శ్రీ రామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంతుడి దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. ఆదివారం స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారు.
ఇదీ చదవండి: