ETV Bharat / state

అనాథలకు అండగా.. వివేకానంద ఫౌండేషన్!

పరుల సేవే పరమావధిగా భావించేవారు అరుదుగా కనిపిస్తుంటారు. కడప జిల్లాకు చెందిన రామకృష్ణ అలాంటి కోవకే చెందుతారు. 'బాసట', 'చేయూత', 'ప్రాణదాత'.. ఇలా అనేక రకాల పేర్లతో సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అనాథలకు సేవలు చేస్తున్న ఫౌండేషన్
అనాథలకు సేవలు చేస్తున్న వివేకానంద ఫౌండేషన్
author img

By

Published : May 9, 2021, 5:25 PM IST

అనాథలకు సేవలు చేస్తున్న వివేకానంద ఫౌండేషన్

అనాథలు కనిపిస్తే చాలు.. బంధువులుగా 'చేయూత'నిస్తారు. నిరాశ్రయులు ఎదురైతేచాలు అన్ని విధాలా ఆదుకుని 'బాసట'గా నిలుస్తారు. పేద విద్యార్థులని తెలిస్తే చాలు.. ఆర్థిక'అండ' అందిస్తారు. కొవిడ్ రోగులని తెలిసి అంత్యక్రియలకు బంధువులే రాకున్నా.. అన్నీ తామై సంప్రదాయంగా సంస్కారాలు నిర్వహిస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేసేది వేలమందో వందమందో కాదు... కేవలం పదులమంది సహకారంతో.. పాపిజెన్ని రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ సేవలన్నీ నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

వివేకానంద ఫౌండేషన్' స్వచ్ఛంద సేవా సంస్థతో సేవలు...

కడప జిల్లా కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన రామకృష్ణారెడ్డి 11 ఏళ్లుగా... 'వివేకానంద ఫౌండేషన్' స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో సేవలందిస్తున్నారు. 60 మంది సభ్యుల సహకారంతో ముందుకు సాగుతున్నారు. రైల్వేగేట్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. వేతనంలో సగం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు కాశినాయన మండలం ఓబులాపురంలో సగిలేరు నది ఒడ్డున వివేకానంద ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరి 12న సేవాశ్రమం ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమాలు నచ్చి తామూ సేవలు అందిస్తున్నామని... ఫౌండేషన్ సభ్యులు గర్వంగా చెబుతున్నారు.బతికున్నంత వరకూ సేవలు కొనసాగిస్తూనే ఉంటామని.. వివేకానంద ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

మామిళ్లపల్లె పేలుడు ఘటనపై విచారణకు కమిటీ: పెద్దిరెడ్డి

కేంద్ర మంత్రి ప్రతాప్​ సారంగికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.