ETV Bharat / state

YS Viveka Murder Case : 'వివేకా మృతదేహాన్ని తొలుత చూసింది వాళ్లే'

viveka murder case : వై.ఎస్‌. వివేకా హత్య ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి వివేకా మృతదేహాన్ని తొలుత చూసింది వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్‌ ఇనయతుల్లా సీబీఐకి వెల్లడించారు. ఆ తర్వాత మిగిలిన వారు లోపలికెళ్లారన్నారు.

viveka
viveka
author img

By

Published : Feb 25, 2022, 5:33 AM IST

Updated : Feb 25, 2022, 6:42 AM IST

viveka murder case : మాజీ మంత్రి వివేకా మృతి సమాచారం వెలుగుచూశాక తొలుత ఆయన ఇంట్లోని బాత్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించింది వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్‌ ఇనయతుల్లా సీబీఐకి చెప్పారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు మృతదేహాన్ని చూసి బయటకు వచ్చాక మిగిలినవారు లోపలికెళ్లారని.. బెడ్‌రూమ్‌లోని రక్తం, వివేకా మృతదేహం ఫొటోల్ని తాను తీశానని వివరించారు. తాను ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించిన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి (అవినాష్‌రెడ్డి కజిన్‌) తనపై కేకలు వేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిలు సంఘటనాస్థలానికి చేరుకున్నారని చెప్పారు. వారి రాక ముందే వివేకా మృతదేహానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించానని తెలిపారు. ఆ సమయంలో వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి గదిలో ఉన్నారని.. వివేకాకు ఏదో జరిగిందన్న అనుమానం తనకు ఉందంటూ ఆయనతో చెప్పానని వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలు గదిలో చర్చించుకుంటూ కనిపించారని తెలిపారు. కొంతసేపయ్యాక వివేకా గుండెపోటుతో చనిపోయారని.. గాయాలకు బ్యాండేజీ, కాటన్‌ చుట్టాలంటూ వారు చెప్పారని వెల్లడించారు. ఈ మేరకు గతేడాది డిసెంబరు 8న సీబీఐ అధికారులకు ఆయనిచ్చిన వాంగ్మూలం ప్రతులు గురువారం వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివి.

"వివేకా ఇంట్లోని రక్తపుమడుగు శుభ్రం చేయించాలని ఎర్ర గంగిరెడ్డి నాతో చెప్పారు. ఆ మాటలకు నేను సరిగ్గా స్పందించకపోయేసరికి 3సార్లు గట్టిగా కేకలు వేశారు. గంగిరెడ్డి ఎందుకు అంతలా కంగారు పడుతున్నాడు? రక్తపుమడుగు శుభ్రం చేయించాలని ఎందుకు అడుగుతున్నాడు? అంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని ప్రశ్నించా. తనకూ అదే అర్థం కావట్లేదంటూ ఆయన సమాధానమిచ్చాడు. ఆ తర్వాత వై.ఎస్‌. భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌. మనోహర్‌రెడ్డిలు వివేకా మృతదేహాన్ని ఉంచేందుకు ఇంట్లోకి ఫ్రీజర్‌ బాక్సు తెప్పించారు" -షేక్‌ ఇనయతుల్లా

సీఐ శంకరయ్య బాత్‌రూమ్‌ను పరిశీలించేందుకు వెళ్లగా.. నేను ఆయన్ను అనుసరించా. ఆ సమయంలో అక్కడున్న అల్మారా హ్యాండిల్‌ విరిగి ఉన్నట్లు చూశా. ఇంతకుముందు ఇది విరిగిలేదని శంకరయ్యకు చెప్పా. గోడలపై రక్తపుమరకల్ని గమనించా. వివేకాను ఎవరో చంపేసి ఉంటారని తనకు అనుమానంగా ఉందని సీఐ శంకరయ్యతో చెప్పా. ‘మీ సార్‌ను చంపాలని ఎవరు అనుకుంటారు? కమోడ్‌పై పడిపోయుంటారు. అందుకే తలకు గాయాలై రక్తం వచ్చి ఉంటుంది’ అని ఆయన నాకు ఎదురు సమాధానమిచ్చారు. ఆ తర్వాత వివేకా మృతదేహాన్ని చూస్తే ఆయన మెడ వంగినట్లు కనిపించింది. దాన్ని తిన్నగా చేయాలని ప్రయత్నించా. ఆ సమయంలో నా వేళ్లు వివేకా పుర్రె లోపలికి వెళ్లాయి. దీంతో నేను ఏడుస్తూ పెద్దగా కేకలు వేశా. తల వెనుక వైపునా తీవ్ర గాయాలున్నట్లు చూశా. ఇదే విషయమై ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పగా.. ఎం.వి.కృష్ణారెడ్డి పోలీసు ఫిర్యాదు ఇస్తారని తెలిపారు. ఫిర్యాదిస్తే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లాల్సి ఉంటుందని, లేకపోతే అవసరం లేదని సీఐ శంకరయ్య ఆ సమయంలో అక్కడున్నవారితో చెప్పారు. గంగిరెడ్డి నమ్మదగ్గ వ్యక్తి కాదని వివేకా చెప్పారు. -షేక్‌ ఇనయతుల్లా

ఇదీ చదవండి :

వివేకా హత్య రక్తపు మరకలు తెదేపాకు అంటించాలని చూశారు: చంద్రబాబు

Last Updated : Feb 25, 2022, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.