మాజీమంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. 14వందల 61 మంది అనుమానితులను ప్రశ్నించామని.. 62 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామని తెలిపారు. వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును..సీబీఐకి అప్పగించాలనేందుకు పిటిషనర్ బీటెక్ రవి బలమైన కారణాలు పేర్కొనలేదన్నారు. కేసులో ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నామన్న ఆరోపణలు నిరాధారమైనవి పేర్కొన్నారు. బీటెక్ రవి వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు. ఇదే కేసులో కడప ఎస్పీ వేరుగా ప్రమాణపత్రం దాఖలు చేశారు. దర్యాప్తు క్రియాశీలకంగా సాగుతోందని, నిందితులకు పోలిగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్ష, బ్రెయిన్ మ్యాపింగ్ చేశామని కోర్టుకు వివరించారు. హైబీపీ ఉన్నందున వైద్యుల సలహా మేరకు పరమేశ్వర్ రెడ్డికి నార్కో పరీక్ష నిర్వహించలేదని పేర్కొన్నారు.
ఇదీచదవండి