ETV Bharat / state

వివేకా హత్య కేసులో సిట్​ దూకుడు - కడప వివేకా హత్య కేసు వార్తలు

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును. సిట్ అధికారులు భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. 8 నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులను సైతం విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కేసును లోతుగా విచారణ చేసిన సమయంలో కూడా పిలవని తెదేపా నేతలను నేడు విచారణకు పిలుస్తుండటం చర్చనీయాంశమైంది. తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని 5 గంటలపాటు విచారించిన సిట్ అధికారులు.. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని కూడా విచారించడం గమనార్హం. నేడు మరికొందరు ప్రముఖులను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వివేకా హత్య కేసులో సిట్​ దూకూడు
వివేకా హత్య కేసులో సిట్​ దూకూడు
author img

By

Published : Dec 6, 2019, 4:59 AM IST

Updated : Dec 6, 2019, 7:03 AM IST

మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పటి నుంచి హంతకులను గుర్తించేందుకు సిట్ అధికారులు చేసిన విచారణ తీరు ఒక ఎత్తైతే.... ప్రస్తుతం జరుగుతున్న విచారణలో చాలా వేగం పెరిగింది. గతంలో వై.ఎస్.కుటుంబ సభ్యులతోపాటు దాదాపు 1300 మంది అనుమానితులను విచారించిన సిట్ అధికారులు... ఆధారాలు లభించలేదనే కారణంతో కాలయాపన చేశారు. మూడు నెలల నుంచి కేసులో కదలిక కనిపించలేదు. కాగా నాలుగు రోజుల నుంచి ఒక్కసారిగా సిట్ అధికారులు దూకుడు పెంచారు. మొదటిరోజు వై.ఎస్.భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను పిలిచిన సిట్ అధికారులు... ఇక వరసగా తెదేపా వారిని విచారణ చేస్తున్నారు. వివేకా హత్యపై గతంలో రెండు పార్టీల వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వివేకానందరెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా వందలమంది అనుమానితులను విచారించారు. నేడు మరికొందరు ప్రముఖులను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బీటెక్​ రవిపై ప్రశ్నలవర్షం
గతంలో వివేకాపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బీటెక్ రవికి సంబంధించి పులివెందుల రాజకీయ నాయకులతో ఏమైనా సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కొనసాగించారా అనే కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. వీటితోపాటు సెప్టెంబరు 3న సిట్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసిన శ్రీనివాస్ రెడ్డి ఘటనపై రవిని ప్రశ్నించారు. ఇతనితోపాటు సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన పరమేశ్వర్ రెడ్డిని విచారించారు. పరమేశ్వర్ రెడ్డితో ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. వివేకా కేసు చేధించేందుకు సిట్ అధికారులు విచారణకు ఎపుడు పిలిచినా వస్తానని.... అన్ని విధాల సహకరిస్తానని బీటెక్ రవి తెలిపారు. దోషులను పట్టుకునే విధంగా ముఖ్యమంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
దేవగుడి నారాయణరెడ్డిని విచారించిన సిట్​ అధికారులు
మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన సందర్భంలో వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. మార్చి 15వ తేదీ వివేకానందరెడ్డి జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాతే హత్యకు గురయ్యారు. ఈ కారణంతో సిట్ అధికారులు దేవగుడి సోదరులపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు పిలుస్తున్నారు. విచారణకు సహకరిస్తానని నారాయణరెడ్డి తెలిపారు. నేడు, రేపు మరికొందరు ప్రముఖులను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారణకు పిలుస్తారనే ప్రచారం సాగుతోంది.

ఇవీ చదవండి

వివేకా కేసులో అసలు దోషులను పట్టుకోండి: బీటెక్ రవి

sample description
Last Updated : Dec 6, 2019, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.